ETV Bharat / state

వృద్ధుడికి అరుదైన గుండె శస్త్రచికిత్స చేసిన నిమ్స్ వైద్యులు

author img

By

Published : Apr 6, 2021, 7:15 PM IST

నిమ్స్ ఆస్పత్రి వైద్యులు ఓ వృద్ధుడికి అరుదైన శస్త్ర చికిత్స చేశారు. గుండె దడతో బాధపడుతున్న 62 ఏళ్ల వృద్ధుడికి విజయవంతంగా ఈ చికిత్స నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు. లక్షల్లో ఒకరికి ఇలాంటి సమస్య తలెత్తుతుందని పేర్కొన్నారు.

nims rare operation, nims doctors
నిమ్స్ వైద్యుల అరుదైన శస్త్ర చికిత్స, నిమ్స్ వైద్యుల గుండె చికిత్స

నిమ్స్‌లో ఓ వృద్ధుడికి వైద్యులు అరుదైన గుండె చికిత్స చేశారు. బిహార్‌కు చెందిన సుగ్నాకర్ ఝా కొంతకాలంగా గుండె వ్యాధితో బాధపడుతున్నారు. సాధారణంగా గుండె వేగం నిమిషానికి 70సార్లు కొట్టుకుంటే... సుగ్నాకర్ ఝాకు మాత్రం 180 నుంచి 250 సార్లు కొట్టుకుంటోందని వైద్యులు తెలిపారు. బిహార్, దిల్లీలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకున్నా గుండె వేగం ఏమాత్రం తగ్గలేదని వెల్లడించారు. దీనివల్ల తీవ్రమైన గుండె దడతో సుగ్నాకర్ ఝా అకస్మాత్తుగా కళ్లు తిరిగి పడిపోయేవారని పేర్కొన్నారు.

62 ఏళ్ల సుగ్నాకర్‌ను కార్డియాలజిస్టులు పరిశీలనలో ఉంచినట్లు తెలిపారు. కార్డియాలజీ విభాగాధిపతి సాయి సతీశ్ ఆధ్వర్యంలో వైద్యుల బృందం 3 రోజుల పాటు పరిశీలించి... గుండె దడకు తగిన వైద్యం చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం సుగ్నాకర్ ఝా పరిస్థితి నిలకడగా ఉందని, లక్షల్లో ఒకరికి ఇలాంటి సమస్య తలెత్తుతుందని గుండె వైద్య నిపుణులు సాయి సతీశ్ తెలిపారు.

ఇదీ చదవండి: నేను చేసిన అభివృద్ధి చూసి వలస వచ్చి.. స్థిరపడ్డారు: జానారెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.