ETV Bharat / state

DARBHANGA RAIL BLAST CASE : దర్భంగ పేలుళ్ల కేసులో ఛార్జ్​షీట్ దాఖలు చేసిన ఎన్​ఐఏ - దర్భంగ పేలుడు కేసు

DARBHANGA RAIL BLAST CASE : దర్భంగ పేలుళ్ల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ పాట్నాలోని ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానంలో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. మహ్మద్ నసీర్ ఖాన్, ఇమ్రాన్ మాలిక్, సలీం అహ్మద్, కఫిల్ అహ్మద్, ఇక్బాల్ మహమ్మద్​లను నిందితులుగా పేర్కొంటూ అభియోగం మోపింది.

DARBHANGA RAIL BLAST CASE
DARBHANGA RAIL BLAST CASE
author img

By

Published : Dec 23, 2021, 10:21 PM IST

DARBHANGA RAIL BLAST CASE : దర్భంగ పేలుళ్ల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ ఛార్జ్​షీట్ దాఖలు చేసింది. పాట్నాలోని ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానంలో ఛార్జ్​షీట్ దాఖలు చేసిన ఎన్ఐఏ.... ఐదుగురిపై అభియోగం మోపింది. మహ్మద్ నసీర్ ఖాన్, ఇమ్రాన్ మాలిక్, సలీం అహ్మద్, కఫిల్ అహ్మద్, ఇక్బాల్ మహమ్మద్​ను నిందితులుగా పేర్కొన్నారు. జూన్ 17న దర్భంగ రైల్వే స్టేషన్​లో పేలుడు సంభవించింది. స్థానిక ఠాణాలో కేసు నమోదైన తర్వాత ఎన్ఐఏకు బదిలీ అయింది. ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు చేపట్టి... పేలుళ్లలో లష్కరే తోయిబా పాత్ర ఉందని తేల్చారు. పాకిస్థాన్‌లో ఉంటూ లష్కరే తోయిబా కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్న హఫీజ్ ఇక్బాల్ ఆదేశాల మేరకు రైల్వే బాంబు పేల్చేందుకు కుట్ర పన్నినట్లు ఎన్ఐఏ ఛార్జ్ షీట్‌లో పేర్కొంది.

NIA FILES CHARGE SHEET ON DARBHANGA INCIDENT : ఈ మేరకు నసీర్ ఖాన్ పలుసార్లు పాకిస్థాన్ వెళ్లి బాంబులు తయారీలో శిక్షణ పొందాడు. అనంతరం హైదరాబాద్ వచ్చి తన సోదరుడు ఇమ్రాన్ మాలిక్​తో కలిసి హబీబ్​నగర్​లో చీరల వ్యాపారం పేరుతో నివాసం ఉన్నారు. పాకిస్థాన్ నుంచి పలుసార్లు నసీర్ ఖాన్​కు నిధులు కూడా వచ్చినట్లు ఎన్ఐఏ అధికారుల దర్యాప్తులో తేలింది. పేలుళ్ల కోసం చీరల మూటలో బాంబు పెట్టి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​కు వచ్చి దర్భంగ ఎక్స్​ప్రెస్ రైళ్లో చీరల పార్శిల్ పంపించారు. కదులుతున్న రైల్లో బాంబులు పేల్చడం వల్ల ప్రాణనష్టం కలిగించేందుకు కుట్ర పన్నారని ఎన్ఐఏ ఛార్జ్ షీట్​లో పేర్కొంది.

కదులుతున్న రైల్లో బాంబు పేలి మంటలు అంటుకొని తీవ్ర ప్రాణనష్టం కలిగేలా చేయాలని లష్కరే తోయిబా కుట్ర పన్నినట్లు ఎన్ఐఏ అధికారులు తెలిపారు. పేలుళ్ల తర్వాత నిందితులు నేపాల్ మీదుగా విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నించారు. పకడ్బందీగా నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎన్ఐఏ అధికారులు తెలిపారు. దర్భంగ పేలుళ్లకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోందని ఎన్ఐఏ అధికారులు తెలిపారు.

కేసు ఏమిటంటే..

DARBHANGA RAIL BLAST CASE : యూపీకి చెందిన మాలిక్‌ సోదరులు తమ తల్లితో కలిసి ఆరేళ్ల కిందట హైదరాబాద్‌కు వచ్చారు. ఫుట్‌పాత్​పై బట్టలు విక్రయిస్తు మల్లేపల్లిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారు. అనారోగ్యంగా ఉన్న తమ తల్లికి చికిత్స చేయించేందుకు వచ్చినట్టు ఇంటి యజమానికి తెలిపారు. లష్కరేతోయిబా ఆదేశాల కోసం వేచి చూసి ఆదేశాలు అందగా గత నెల 15న భారీ పేలుళ్లకు కుట్ర పన్నారు. ముందుగా ఇంట్లోనే ఐఈడీ ద్రావణాన్ని తయారు చేసి వస్త్రాల మధ్య ఉంచి సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ పార్శిల్‌ కౌంటర్‌లో ఇచ్చారు.

55 కిలోల బరువున్న చీరల పార్సిల్ మధ్యలో పేలుడు స్వభావం ఉన్న రసాయన సీసాను పెట్టారు. గత నెల 15న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​లో పార్సిల్​ను... దర్భంగకు సుఫియాన్ అనే వ్యక్తి పేరుతో నకిలీ పాన్​కార్డు చూపించి పంపించారు. చరవాణి నంబర్ కూడా నకిలీదే ఇచ్చారు. 17న దర్భంగలో పార్సిల్​ను రైలు నుంచి తీసిన తర్వాత స్వల్ప పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఎలాంటి నష్టం కలగలేదు.

అలాంటి వాళ్లు అనుకోలేదు..

ఎన్‌ఐఏ దర్యాప్తులో భాగంగా మల్లేపల్లిలో సోదాలు నిర్వహించడంతో విషయం తెలిసి స్థానికులు కంగుతిన్నారు. తమకెప్పుడు వారిపై ఎలాంటి అనుమానం రాలేదన్నారు. వాళ్లు కేవలం బట్టల వ్యాపారం చేసుకునే వారే అనుకున్నామని.. విషయం తెలిసి ఉలిక్కిపడ్డామన్నారు.

ఇదీ చూడండి: Darbhanga Blast: హైదరాబాద్‌ రానున్న ఎన్‌.ఐ.ఎ.. దర్బంగా కేసులో అభియోగపత్రం..!

Darbhanga Blast: దిల్లీకి దర్భంగ పేలుడు కేసు నిందితులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.