ETV Bharat / state

మూసీ నది ప్రక్షాళన పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీ: ఎన్జీటీ - మూసీ నది

NGT set up committee to monitor Moosi River cleanup
మూసీ నది ప్రక్షాళన పర్యవేక్షణకు కమిటీ: ఎన్జీటీ
author img

By

Published : Sep 27, 2020, 11:14 AM IST

Updated : Sep 27, 2020, 11:45 AM IST

11:10 September 27

మూసీ నది ప్రక్షాళన పర్యవేక్షణకు కమిటీ ఏర్పాటు చేసిన ఎన్జీటీ

మూసీ నది ప్రక్షాళన పర్యవేక్షణకు ఎన్జీటీ కమిటీని ఏర్పాటు చేసింది. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ విలాస్ అప్జల్‌పుర్కర్ నేతృత్వంలో ఈ కమిటీని నియమించింది. ఇందులో సీపీసీబీ, రాష్ట్ర పీసీబీ ప్రతినిధులు, హైదరాబాద్ కలెక్టర్ సభ్యులుగా ఉంటారు. నెల రోజుల్లో మానిటరింగ్ కమిటీ తొలి సమావేశం నిర్వహించాలని కమిటీని ఎన్జీటీ ఆదేశించింది.  

నాలుగు నెలల్లో తొలి నివేదిక అందజేయాలని.. ఏడాదిలో మూసీ నది ప్రక్షాళను పూర్తి చేయాలని సూచించింది. మూసీ ప్రక్షాళనకు ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ఎన్జీటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. మూసీ నది ప్రక్షాళనకు అంచనా వ్యయం కూడా అధికంగా వేసినట్లు గుర్తించామని.. సాధారణ ధర కంటే 20 రెట్లు అధికంగా అంచనా వేశారని అభిప్రాయపడింది. మూసీ నది ప్రక్షాళనపై మహ్మద్ నహీం పాషా అనే వ్యక్తి ఎన్జీటీలో పిటిషన్ వేశారు.  నహీం పాషా పిటిషనన్‌పై లిఖితపూర్వక ఆదేశాలను ఎన్జీటీ వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.

ఇదీ చదవండి: ఆశలపై నీళ్లు... కుండపోత వానలతో అన్నదాత ఆగమాగం

Last Updated : Sep 27, 2020, 11:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.