ఆగ్నేయ, తూర్పు మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. ఆ కారణంగా రాగల 24 గంటల్లో వాయుగుండముగా మారే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వాయుగుండం రాగల 48 గంటల్లో తుఫానుగా మారే అవకాశం ఉందని, జూన్ 3 నాటికి ఉత్తర మహారాష్ట్ర, గుజరాత్ తీరాలకు చేరే అవకాశం ఉందని ప్రకటించింది.
ఈదురుగాలులతో కూడిన..
ఛత్తీస్‌గఢ్ నుంచి లక్షదీవుల వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతుందని, తెలంగాణ, రాయలసీమ, దక్షిణ మధ్య కర్ణాటక మీదుగా ఉపరితల ద్రోణి ఉంటుదని సమాచారం. నైరుతి రుతుపవనాలు రేపు కేరళలోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో రాగల మూడు రోజులు అక్కడక్కడ వర్షాలు పడొచ్చని, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకురాలు నాగరత్న తెలిపారు.
ఇదీ చూడండి : ప్రత్యేక రైళ్లలో వేళ్లేవారు ఆ సూచనలు పాటించాలి