ETV Bharat / state

గుత్తా సుఖేందర్​రెడ్డిని కలిసిన టీఎన్జీవో నేతలు

నూతనంగా ఎన్నికైన టీఎన్జీవోస్ అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్​, ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్​, మాజీ అధ్యక్షులు కారం రవీందర్​రెడ్డి .. హైదరాబాద్​లో మండలి ఛైర్మన్​ గుత్తా సుఖేందర్​రెడ్డిని కలిశారు. సీఎం కేసీఆర్​ ప్రవేశపెట్టిన నూతన రెవెన్యూ బిల్లును స్వాగతిస్తున్నట్లు సంఘం నాయకులు వెల్లడించారు.

author img

By

Published : Sep 9, 2020, 8:12 PM IST

tngos meet gutta sukhendar reddy at hyderabad
గుత్తా సుఖేందర్​రెడ్డిని కలిసిన టీఎన్జీవో సంఘం నాయకులు

హైదరాబాద్​లో శాసనమండలి ఛైర్మన్​ గుత్తా సుఖేందర్​రెడ్డిని నూతనంగా ఎన్నికైన టీఎన్జీవోస్ అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్​, ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్​, మాజీ అధ్యక్షులు కారం రవీందర్​రెడ్డి కలిశారు. తెలంగాణలో ఉద్యోగుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడంలో గుత్తా సహాయం కావాలని టీఎన్జీవోస్ అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ కోరారు. ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను చేరవేయడంలో వదులుగా ఉండి.. ప్రభుత్వానికి మంచిపేరు తీసుకురావాలని సంఘం నాయకులను గుత్తా సుఖేందర్​రెడ్డి తెలిపారు.

ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన రెవెన్యూ బిల్లును స్వాగతిస్తున్నామని టీఎన్జీవో సంఘం నాయకులు వెల్లడించారు. తరతరాలుగా ఇబ్బంది పడుతున్న రైతులకు రక్షణ కల్పించేందుకు, భూములున్నవారికి రక్షణ కల్పించేందుకు సీఎం కేసీఆర్​ ప్రవేశపెట్టిన బిల్లు చారిత్రాత్మకమైన నిర్ణయమని అభివర్ణించారు. తక్కువ వేతనంతో పనిచేస్తున్న వీఆర్​ఏలకు పేస్కేలు నిర్ణయించడంపై హర్షం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: ఇకనుంచి తహసీల్దార్లే జాయింట్‌ రిజిస్ట్రార్‌లు: కేసీఆర్‌

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.