హైదారాబాద్ పంజాగుట్టలోని సాయి మందిరంలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. కొత్త సంవత్సరాన్ని పురస్కరిచుకొని ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు.
నూతన ఏడాదిని స్వాగతిస్తూ భజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని భక్తి గీతాలను ఆలపించారు. ఆలయ ప్రాంగణం అంతా ఆధ్యాత్మిక శోభతో వెల్లివిరిసింది. గత ఐదేళ్లుగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నామని.. ఈ కొత్త ఏడాది ప్రజలకు ఆరోగ్యాన్ని, సంతోషాన్ని ప్రసాదించాలని ఆలయ నిర్వాహకులు బసవయ్య పేర్కొన్నారు.
ఇదీ చూడండి: పోలీసులు స్ట్రిక్ట్.. ఈసారి తగ్గిన ఈవెంట్ల జోష్...