నూతన సంవత్సర వేడుకలను జర్నలిస్టు హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలకు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి శ్రీనివాస్ గౌడ్, కథానాయకుడు నిఖిల్, హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ ముఖ్య అతిథులుగా హాజరై జర్నలిస్టు కుటుంబాలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
జర్నలిస్టు పడే కష్టం విలువను లెక్కగట్టలేమని.. సమాజం కోసం అహర్నిశలు పాటుపడే జర్నలిస్టు మిత్రుల సేవలు ఎంతో విలువైనవని వక్తలు అభిప్రాయపడ్డారు. జర్నలిస్టు కుటుంబాలను ఈ సందర్భంగా ఒక దగ్గర కలుసుకోవటం సంతోషంగా ఉందని పేర్కొంటూ వారి పిల్లలకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు.
ఇదీ చూడండి: పోలీసులు స్ట్రిక్ట్.. ఈసారి తగ్గిన ఈవెంట్ల జోష్...