అనేక సంస్థల్లో కొత్త నియామకాలన్నీ ప్రస్తుతం వర్చువల్‌గానే సాగుతున్నాయి. ఐటీ సంస్థలు తమ ఉద్యోగులతో ఇంటి నుంచే పనిచేయిస్తున్న విషయం తెలిసిందే. పలు సంస్థలు మార్చి వరకు ఇదే విధానం కొనసాగిస్తుండగా.. అమెజాన్ జూన్ వరకు తమ ఉద్యోగులకు ఇంటి నుంచే పనికి అవకాశం ఇచ్చింది. కొంతమందిని మాత్రమే కార్యాలయం వరకు అనుమతిస్తున్నారు.
కొవిడ్‌తో వివిధ సంస్థల్లో కొందరు ఉద్యోగాలు కోల్పోగా, మరికొందరు కంపెనీలు మారారు. ఇదే సమయంలో ప్రస్తుతం కొత్త నియామకాలూ జోరందుకున్నాయి. ప్రతి రెండింటిలో ఒక కంపెనీ వర్చువల్ విధానంలో ఎంపిక చేస్తున్నట్లు ఇన్‌డీడ్ సంస్థ సర్వేలో తేలింది. తద్వారా హైదరాబాద్‌లో లేదంటే సొంత ఊర్లో ఉంటూనే దిల్లీ, ముంబయి, ఫుణె, బెంగళూరు, చెన్నైలోని ఉద్యోగాల ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.
వర్చువల్ విధానంలో ఎంపికలు..
- 95% ఐటీ/బీపీవో
- 90% మీడియా, వినోద రంగం
- 87% టెలికాం రంగం
ప్రతి అయిదింటిలో నాలుగు
- భారీ, మధ్య తరహా, చిన్న సంస్థలు మొదలు అంకుర సంస్థల వరకు ఆన్‌లైన్‌లోనే ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగాలకు ఎంపిక చేస్తున్నాయి.
- 26 శాతం: వర్చువల్ విధానంలో నియామకాలు కొత్తగా ఉన్నాయని చెప్పిన సంస్థలు
- 22 శాతం: కొవిడ్ సమయంలో ఇదే సరైన, సురక్షిత పద్ధతి అన్న సంస్థలు
కొత్త సాంకేతికలపై ఆధారపడిన రంగాల్లో ఈ తరహా నియామకాలు ఎక్కువగా ఉన్నాయి.
ఇదీ చూడండి : కరోనా సమయంలోనూ ఉస్మానియా ఘనత