కోర్టుల్లో కేసుల పెండెన్సీ పెరగటంతో పాటు... పలు కేసులు వీగిపోవడానికి ప్రధాన సమస్యల్లో ఒకటైన ప్రాసిక్యూషన్ సిబ్బంది కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రాసిక్యూషన్ విభాగం, హైకోర్టులో కొత్త కొలువులు రానున్నాయి.
ఓఎస్డీ పోస్టు
డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ పరిధిలో రాష్ట్రంలోని పలు న్యాయస్థానాల్లో పని చేసే విధంగా కొత్త పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. 450 పోస్టులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టులో 183 సూపర్ న్యూమరరీ పోస్టులు.. ప్రాసిక్యూషన్ విభాగంలో 267 పోస్టులు ఏర్పాటు చేసింది. అసిస్టెంట్ రిజిస్ట్రార్ హోదాలో ఓఎస్డీ పోస్టును కొత్తగా మంజూరు చేసింది.
ఇవీచూడండి: హైదరాబాద్లో 'పౌర' సెగ: వామపక్ష నేతల అరెస్ట్