ETV Bharat / state

ఊహించని మలుపులతో... ఆసక్తికరమైన ఫలితాలతో.. - జీహెచ్​ఎంసీ ఫలితాలు

ప్రతిష్ఠాత్మకమైన హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ(జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో ఓటర్లు తమ తీర్పు చెప్పేశారు. చేసిన అభివృద్ధిని చెబుతూ, ముందుముందు నగరానికి ఏం చేయనున్నదీ ప్రణాళికలను ఆవిష్కరిస్తూ రోడ్‌షోలు.. పాదయాత్రలు.. ర్యాలీలతో తమ ముందుకొచ్చిన పార్టీలకు విలక్షణ ఫలితాలను అందించారు. ఇవి భాజపాలో జోష్‌ నింపగా, మరికొన్ని స్థానాలను సాధిస్తే బావుండేదే అన్న విశ్లేషణలో తెరాస మునిగిపోయింది. ఇదే సమయంలో ఎంఐఎం పార్టీ గతంలో మాదిరిగానే 44 స్థానాలను సాధించి తమకు తిరుగులేదన్న సంకేతాలను ఇచ్చింది. ఈ ఎన్నికల్లో తీవ్రంగా దెబ్బతిన్న కాంగ్రెస్‌ కేవలం రెండు స్థానాలకే పరిమితమైంది. మిగిలిన పార్టీలతోపాటు స్వతంత్రులు తమ ప్రభావాన్ని చూపలేకపోయారు.

never-before-these-kind-of-ghmc-election-results
ఊహించని మలుపులతో... ఆసక్తికరమైన ఫలితాలతో
author img

By

Published : Dec 5, 2020, 7:02 AM IST

బల్దియా ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగింది. ఒకరికొకరు ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజధాని నగరం పది రోజులపాటు దద్దరిల్లింది. ఈసారి ఎలాగైనా మేయర్‌ పీఠం దక్కించుకోవడానికి తెరాస, భాజపా విశ్వప్రయత్నాలు చేశాయి. తెరాస తరఫున రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులతో పాటు అనేకమంది నాయకులు పాల్గొన్నారు. మంత్రులు డివిజన్‌ ఇన్‌ఛార్జిలుగా ఉన్నారు. భాజపా తరఫున కేంద్రమంత్రులతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన నేతలు నగరానికి వచ్చి ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో ఉన్న భాజపా క్యాడర్‌ అంతా రాజధానికి తరలివచ్చింది. ఎంఐఎం కూడా ఈసారి ధీటుగా ప్రచారాన్ని చేసింది. ఈ నేపథ్యంలో ఫలితాలు ఎలా ఉంటాయోనని అంతా ఆసక్తిగా ఎదురుచూశారు.

అంచనాలకు భిన్నంగా

ఈసారి 90 నుంచి 104 స్థానాల వరకు వస్తాయని తెరాస నేతలు అంచనా వేశారు. పోలింగ్‌ సరళి కూడా అనుకూలంగా ఉందని, ప్రధానంగా బస్తీ ఓటర్లు ఏకపక్షంగా వేశారని ఊహించారు. మధ్యాహ్నం తరువాత ఫలితాలు వరుసగా వెలువడుతుండగా మొదట్లో నేతల్లో ఉత్సాహం తొణికిసలాడింది. సమయం గడిచే కొద్దీ అనేక స్థానాల్లో భాజపాకు ఆధిక్యత వస్తుండటంతో కొంత నిరుత్సాహానికి గురయ్యారు. ఇక భాజపా విషయానికి వస్తే 40-50 స్థానాలను వస్తాయని నాయకులు అంచనా వేశారు. కాలనీల్లో ఓటింగ్‌ తగ్గడంతో ఫలితాలు ఎలా ఉంటాయోనని గత రెండు రోజులుగా కొంతమంది నిరుత్సాహానికి గురయ్యారు. అయితే 48 వరకు స్థానాలు రావడంతో పార్టీ శ్రేణులు సందడిచేశాయి. ప్రస్తుతం మేయర్‌ పీఠానికి తమ అభ్యర్థుల్లో ఎవరిని ఎంపికచేయాలన్నదానిపై తెరాస అధిష్ఠానం కసరత్తు చేస్తోంది. ఎక్స్‌ అఫీషియో సభ్యుల సహకారాన్ని తీసుకోబోతున్నారు. దీనికి సంబంధించి కొద్ది రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

80 మంది మహిళామణులకు పట్టం

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మహిళలు తమ సత్తా చాటారు. తెరాస అత్యధికంగా 85 స్థానాల్లో పోటీ చేసే అవకాశం కల్పించగా.. అందులో 30 మంది విజయం సాధించారు. మజ్లిస్‌ ఈసారి 20 స్థానాలు వారికి కేటాయించగా అన్నింటా విజయబావుటా ఎగరేశారు. భాజపా 74 మంది మహిళలకు టికెట్లు ఇవ్వగా 28 మంది గెలిచారు. ఇక కాంగ్రెస్‌ గెలిచిన రెండు డివిజన్లలోనూ మహిళా అభ్యర్థులే కావడం గమనార్హం.

నాడు 5 పార్టీలు.. నేడు 4...

బల్దియాలో అడుగుపెట్టే రాజకీయ పార్టీల ప్రాతినిధ్యం ఈసారి తగ్గనుంది. గత ఎన్నికలతో పోల్చితే ఈసారి ప్రధాన పార్టీలన్నీ బరిలో నిలిచాయి. 2016లో 99 స్థానాల్లో తెరాస, 44 చోట్ల ఎంఐఎం, 4 స్థానాల్లో భాజపా, రెండు చోట్ల కాంగ్రెస్‌, మరో స్థానంలో తెదేపా విజయం సాధించాయి. ఆ తర్వాత తెదేపా, కాంగ్రెస్‌ నుంచి గెలిచిన కార్పొరేటర్లు తెరాసకు అనుబంధంగా కొనసాగారు. తాజా ఎన్నికల్లో తెరాస, భాజపా, ఎంఐఎం, కాంగ్రెస్‌కు మాత్రమే ప్రాతినిధ్యం దక్కింది. తెదేపా 106 స్థానాల్లో పోటీ చేసినా ఒక్కచోట కూడా గెలవలేదు. ఆ పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా బల్దియాలో ప్రాతినిధ్యం కోల్పోయింది.

జాంబాగ్‌.. మళ్లీ అదే ఉత్కంఠ

2016, 2020.. ఈ రెండు ఎన్నికల్లో ఒక డివిజన్‌ అందరి దృష్టిని ఆకర్షించింది.. అదే జాంబాగ్‌. స్వల్ప ఓట్ల తేడాతో అభ్యర్థులు విజయం సాధించారు. గత ఎన్నికల్లో తెరాస అభ్యర్థి ఆనంద్‌కుమార్‌పై ఎంఐఎం అభ్యర్థి డి.మోహన్‌ కేవలం 5 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈసారీ అదే ఆసక్తి ఏర్పడింది. అనూహ్యంగా ఎంఐఎం సిట్టింగ్‌ స్థానాన్ని భాజపా కైవశం గెలుచుకుంది. భాజపా నుంచి పోటీ చేసిన రాకేశ్‌జైస్వాల్‌ 182 ఓట్ల తేడాతో ఎంఐఎం అభ్యర్థి రవీంద్రపై విజయం సాధించారు. వీరిద్దరూ తొలిసారి బరిలో నిలిచినవారే కావడం విశేషం.

తూర్పు ముఖద్వారం.. తీర్పు వైవిధ్యం

నగరానికి తూర్పు ముఖద్వారం ఎల్బీనగర్‌ ప్రాంతం. ప్రతి ఎన్నికలోనూ ఇది విభిన్నతను చాటుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు భిన్నంగా జీహెచ్‌ఎంసీ ఫలితాలు వస్తుంటాయి. తాజాగా అదే పరిస్థితి పునరావృతమైంది. గత బల్దియా ఎన్నికల్లో ఇక్కడ అన్ని డివిజన్లు తెరాస దక్కించుకోగా ఈసారి వీటన్నింటా భాజపా గెలిచింది. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్బీనగర్‌ నుంచి తెదేపా అభ్యర్థి ఆర్‌.కృష్ణయ్య విజయం సాధించారు. ఆ తర్వాత బల్దియా ఎన్నికలు రాగా ఈ నియోజకవర్గంలోని 11 డివిజన్లలోనూ తెరాస అభ్యర్థులే విజయం సాధించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి విజయం సాధించి అనంతరం తెరాసలో చేరారు. గతయేడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ మల్కాజిగిరి నుంచి పోటీ చేసిన కాంగ్రెస్‌ అభ్యర్థి రేవంత్‌రెడ్డి గెలుపులో ఎల్బీనగర్‌ ప్రజలు కీలకంగా ఉన్నారు. తాజా జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అన్ని డివిజన్లలోనూ ఈసారి భాజపా విజయం సాధించింది. తెరాస సిట్టింగ్‌ కార్పొరేటర్లంతా ఓటమి చవి చూశారు. మంత్రి సబితారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మహేశ్వరం నియోజకవర్గంలోని ఆర్కేపురం, సరూర్‌నగర్‌లనూ భాజపా కైవశం చేసుకుంది.

అనుకున్నదొకటి.. అయిందొకటి

ముందుచూపుతో చేసిన ఓ చిన్న పనే గ్రహపాటుగా మారితే.. ఎల్‌బీనగర్‌ నియోజకవర్గం బి.ఎన్‌.రెడ్డినగర్‌ డివిజన్‌లో అదే జరిగింది. కన్నతల్లి విజయానికి అహర్నిశలు శ్రమించిన తనయుడే.. చివరకు పరోక్షంగా ఆమె ఓటమికీ కారణమైన పరిస్థితి ఇది. ఇక్కడి సిట్టింగ్‌ కార్పొరేటర్‌ ముద్దగౌని లక్ష్మీ ప్రసన్న మరోసారి తెరాస అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఆమె తరపున డమ్మీ అభ్యర్థిగా కుమారుడు రంజిత్‌గౌడ్‌ కూడా నామినేషన్‌ వేశారు. ఫలితాల రోజు లెక్కింపునకు ఏజెంట్‌గా ఉంటాడనే ఉద్దేశంతో ఆయన నామినేషన్‌ ఉపసంహరించుకోలేదు. ఇక ఓట్ల లెక్కింపులో భాజపా అభ్యర్థి లచ్చిరెడ్డికి 11,438 ఓట్లు, లక్ష్మీప్రసన్న 11,406 ఓట్లు సాధించినట్టు అధికారులు ప్రకటించారు. 32 ఓట్ల తేడాతో ఆమె ఓడినట్టు వెల్లడించారు. రంజిత్‌గౌడ్‌కు (టార్చిలైట్‌ గుర్తు) 39 ఓట్లు రావడం గమనార్హం. తల్లీకుమారులు ఇద్దరూ ఒక్కటే అనే భావనతో ఓటర్లు రంజిత్‌గౌడ్‌కు ఓట్లేయడంతో ఈ పొరపాటు జరిగినట్టు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఏజెంట్‌ గుర్తింపుకార్డు కోసం చేసిన పని చేతి వరకు వచ్చిన విజయాన్ని చేజార్చిందంటున్నారు. రీకౌంటింగ్‌ జరపాంటూ లక్ష్మీప్రసన్న నిరసనకు దిగారు. అధికారులు కుదరదని చెప్పడంతో ఆమె వెళ్లిపోయారు.

అక్కడ కాంగ్రెస్‌ గెలిచిందిలా..!

పరిస్థితి మారలేదు. 2016 బల్దియా ఎన్నికల్లో రెండు స్థానాల్లో(నాచారం, పటాన్‌చెరు)లో గెలిచిన కాంగ్రెస్‌ ఇప్పుడు సైతం రెండు స్థానాలే (ఉప్పల్‌, ఏఎస్‌రావునగర్‌) సాధించింది. ఎం.రజిత(ఉప్పల్‌), సింగిరెడ్డి శిరీషారెడ్డి(ఏఎస్‌రావునగర్‌) గెలిచారు. ఎంపీ రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క విస్తృతంగా ప్రచారం చేశారు. రజిత భర్త పరమేశ్వర్‌ గతంలో కార్పొరేటర్‌గా(2009-14) వ్యవహరించారు. 2016లో ఈ స్థానం మహిళకు రిజర్వ్‌ కావడంతో పరమేశ్వర్‌ తన భార్యకు టికెట్‌ ఆశించారు. అధిష్ఠానం నిరాకరించడంతో రజిత స్వతంత్ర అభ్యర్థిగా దిగి 9,364 ఓట్లు సాధించారు. కేవలం 1146 ఓట్ల తేడాతో తెరాస అభ్యర్థి అనలారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్‌ టికెట్‌నే సాధించి విజయం సాధించారు. లాక్‌డౌన్‌ సమయంలో సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. తాజాగా విజయం సాధించారు.

ఇదీ చూడండి: ఎవరికీ దక్కని ఆధిక్యం.. అతిపెద్ద పార్టీగా తెరాస

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.