దేశంలోనే అతి పిన్న వయస్కుడైన 45 రోజుల పసికందు కరోనాని జయించాడు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఈ చిన్నారికి 23 రోజుల వయసున్నప్పుడు పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు గుర్తించారు. తండ్రి నుంచి బాలుడికి ఈ వైరస్ సోకినట్లు నిర్ధారించారు. ఈ క్రమంలో చిన్నారికి గాంధీలో చికిత్స అందించారు. చిన్నారికి మరోసారి నిర్వహించిన పరీక్షలో నెగెటివ్ రావడం వల్ల వైద్యులు డిశ్చార్జ్ చేశారు. ఆ చిన్నారి సహా మొత్తం 13 మంది పిల్లలు కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.
కరోనాపై దేశంలోనే అతి చిన్న పసికందు విజయం - పసికందు
దేశంలోనే అత్యంత పిన్న వయస్కుడైన పసికందు కరోనాను జయించాడు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొంది నేడు డిశ్చార్జ్ అయ్యాడు. విషయం తెలుసుకున్న ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ హర్షం వ్యక్తం చేశారు.