ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు టూరిజం హోటల్లో కాంట్రాక్టు ఉద్యోగినిపై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డ మేనేజర్ భాస్కర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. విషయం తెలుసుకున్న మంత్రి అవంతి శ్రీనివాస్ ఆయనను విధుల నుంచి తప్పించారు.
మాస్కు పెట్టుకోమన్నందుకే...
మాస్కు పెట్టుకోమన్నందుకే దివ్యాంగురాలని కూడా చూడకుండా తనపై మేనేజర్ దాడి చేశారని కాంట్రాక్టు ఉద్యోగిని ఉషారాణి తెలిపారు. దొరికిన ఆయుధాలతో విచక్షణారహితంగా కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆమె ఆరోపించారు. అనంతరం జరిగిన విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. కొంతమంది కావాలనే ఆయనను తనపై దాడికి ఉసిగొల్పారని బాధితురాలు చెప్పారు.
ఇదీ చూడండి:భారత్ బయోటెక్‌కు గవర్నర్ తమిళిసై అభినందనలు