ETV Bharat / state

ఆర్టీపీసీఆర్ పరీక్షలో సీఎం కేసీఆర్‌కు నెగెటివ్ - CM KCR latest news

సీఎం కేసీఆర్​ కొవిడ్​ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఆర్టీపీసీఆర్, యాంటిజెన్‌ పరీక్షలో కేసీఆర్‌కు నెగెటివ్​గా నిర్ధరణ అయింది.

Negative to CM KCR in RTPCR test
ఆర్టీపీసీఆర్ పరీక్షలో సీఎం కేసీఆర్‌కు నెగెటివ్
author img

By

Published : May 4, 2021, 11:14 PM IST

Updated : May 4, 2021, 11:42 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షతోపాటు ఆర్టీపీసీఆర్ పరీక్షలోనూ సీఎంకు నెగెటివ్​గా తేలింది. గత నెల 19న ముఖ్యమంత్రికి కొవిడ్ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. ఆ రోజు నుంచి సీఎం వైద్యుల పర్యవేక్షణలో ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో హోం ఐసోలేషన్​లో ఉన్నారు.

మధ్యలో ఒకసారి సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో సీటీ స్కాన్ సహా ఇతర పరీక్షలు చేయించుకున్నారు. ఏప్రిల్​ 28న కేసీఆర్​కు ర్యాపిడ్ యాంటీజెన్​తో పాటు ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించారు. యాంటీజెన్​ టెస్టులో నెగెటివ్ రాగా.. ఆర్టీపీసీఆర్​లో అందుకు భిన్నమైన ఫలితం వచ్చింది.

తాజాగా కేసీఆర్ వక్తిగత వైద్యుడు ఎంవీరావు ఆధ్వర్యంలో వైద్యబృందం మంగళవారం మరోమారు కరోనా పరీక్షలు నిర్వహించింది. ర్యాపిడ్ యాంటీజెన్​తోపాటు ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించగా... రెండింటిలోనూ నెగిటివ్​గా నిర్ధరణ అయింది. సీఎం రక్తపరీక్షల నివేదికలు కూడా సాధారణంగా ఉన్నాయని తేలింది. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నట్లు వైద్యులు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: ఈటల రాజేందర్​ వ్యాఖ్యలపై తెరాస నేతల ధ్వజం

Last Updated : May 4, 2021, 11:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.