ETV Bharat / state

Neet Exam: దేశవ్యాప్తంగా నీట్ పరీక్షకు సర్వం సిద్ధం - హైదరాబాద్ తాజా వార్తలు

Neet Exam: వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం ఇవాళ దేశవ్యాప్తంగా నీట్ జరగనుంది. రాష్ట్రం నుంచి సుమారు 60వేల మంది అభ్యర్థుల కోసం.. 25 పట్టణాలు, నగరాల్లో.. 115 కేంద్రాలను సిద్దం చేశారు. ఈ ఏడాది పరీక్ష సమయాన్ని 20 నిమిషాలు పెంచారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల 20 నిమిషాల వరకు నిర్వహించనున్నారు. ఒక నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించేది లేదని ఎన్​టీఏ వెల్లడించింది.

నీట్ పరీక్ష
నీట్ పరీక్ష
author img

By

Published : Jul 17, 2022, 4:41 AM IST

Updated : Jul 17, 2022, 9:46 AM IST

Neet Exam: నీట్ పరీక్షకు సర్వం సిద్దమైంది. దేశవ్యాప్తంగా 543 నగరాలు, పట్టణాలతోపాటు.. విదేశాల్లోనూ 13 నగరాల్లో పరీక్ష కేంద్రాలు సిద్దం చేశారు. దేశవ్యాప్తంగా సుమారు 16 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా అందులో రాష్ట్రం నుంచి దాదాపు 60వేల మంది ఉన్నారు. హైదరాబాద్ సహా 25 నగరాలు, పట్టణాల్లో 115 పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేశారు . ఈఏడాది పరీక్ష సమయాన్ని 20 నిమిషాలు పెంచారు.

రెండేళ్లుగా కరోనా వల్ల 20 ప్రశ్నలు అదనంగా ఇచ్చినా సమయాన్ని పెంచలేదు. ఈ ఏడాది సమయం పెంచినందున 200 నిమిషాల్లో 200 ప్రశ్నల్లో 180కి సమాధానాలు రాయాల్సి ఉంటుంది. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల 20 నిమిషాల వరకు.. నీట్ పరీక్ష జరగనుంది. మధ్యాహ్నం ఒకటిన్నర తర్వాత ఒకనిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతి ఉండదని జాతీయ పరీక్షల సంస్థ ఎన్​టీఏ స్పష్టం చేసింది.

ఆంగ్లంతోపాటు తెలుగు, హిందీ వంటి 13 భాషల్లో పరీక్ష ఉంటుంది. నీట్ పరీక్షకు పలు నిబంధనలు, ఆంక్షలను ఎన్​టీఏ ఇప్పటికే ప్రకటించింది. నిబంధనలు బేఖాతరు చేస్తే మూడేళ్ల వరకు డిబార్ చేయనున్నట్లు వెల్లడించింది. అడ్మిట్ కార్డుతోపాటు పాస్‌పోర్టు సైజ్‌ఫోటో, ఆధార్, ఓటరు గుర్తింపు, పాన్‌కార్డు వంటి ఏదైనా గుర్తింపుపత్రం తీసుకెళ్లాలి. అభ్యర్థులు మాస్క్‌ధరించాలని స్పష్టంచేసింది. చిన్నశానిటైజర్ తీసుకెళ్లవచ్చు.

మంచినీళ్ల బాటిల్, ఆహార పదార్థాలను అనుమతించరు. ఐతే అనారోగ్యంతో ఉన్నట్లు ఆధారాలు సమర్పిస్తే మందులు, పారదర్శకమైన నీటిసీసాను అనుమతిస్తారు. ఉంగరాలు, బ్రాస్ లెట్లు, చెవి పోగులు, ముక్కు పుడకలు, గొలుసులు, నెక్లెస్‌లు, హెయిర్‌పిన్, హెయిర్‌బ్యాండ్, తాయత్తులు, పర్సులు, హ్యాండ్ బ్యాగులు, బూట్లు, పొడవు చేతుల చొక్కాలు, చేతి గడియారాలు, పెన్ను, పెన్సిల్, రబ్బరు, కాగితాలు, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని ఎన్​టీఏ స్పష్టంచేసింది. పరీక్ష రాసేందుకు అవసరమైన పెన్నును కేంద్రంలోనే ఇస్తారు. పరీక్ష పూర్తయ్యే వరకు కేంద్రం నుంచి బయటకు వెళ్లనీయరు.

ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులు కేటాయిస్తారు. నెగెటివ్ మార్కులు ఉంటాయి కాబట్టి.. కచ్చితంగా తెలిసిన సమాధానాలే రాయాలని నిపుణులు సూచిస్తున్నారు. సమాన మార్కులొస్తే.. నెగెటివ్ మార్కులు తక్కువ ఉన్నవారికే ర్యాంకులో ప్రాధాన్యం ఇవ్వాలని ఈ ఏడాది ఎన్​టీఏ నిర్ణయించింది. నీట్ ర్యాంకు ద్వారా దేశవ్యాప్తంగా వైద్యకళాశాలల్లో..ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్, బీవీఎస్, ఏహెచ్ సీట్లతో పాటు ఎయిమ్స్, జిప్‌మర్ సీట్లను భర్తీ చేయనున్నారు.

ఇవీ చదవండి: ఎన్ని లక్షల మంది రైతుల ఆదాయం రెట్టింపయ్యిందో చెప్పాలి: కేటీఆర్

అఖిలపక్ష నేతలతో ఓంబిర్లా భేటీ.. వాటిపై చర్చించాలని కాంగ్రెస్​ డిమాండ్​

Last Updated : Jul 17, 2022, 9:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.