ఏపీలోని విశాఖలో గ్యాస్ లీక్ ఘటన ప్రాంతంలో ప్రజలను ఖాళీ చేయించినట్లు ఎన్డీఆర్ఎఫ్ డీజీ ఎస్ఎన్ ప్రధాన్ తెలిపారు. గ్యాస్ లీకైన వెంటనే సహాయ చర్యలు చేపట్టామన్న ఆయన.. ఇళ్లలోకి వెళ్లి బాధితులను ఆస్పత్రులకు తరలించినట్లు చెప్పారు. ఉదయం 6 గంటలకే తమ బృందాలు ఘటనాస్థలానికి చేరుకున్నట్లు స్పష్టం చేశారు.
దాదాపు 500 మందికి పైగా ప్రజలను ఖాళీ చేయించినట్లు ప్రధాన్ పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో 10 మంది చనిపోయినట్లు వెల్లడించారు. 200 మందికిపైగా వైద్య సహాయం పొందుతున్నట్లు తెలిపారు. తెల్లవారుజామున 2.30 గంటలకు గ్యాస్ లీక్ జరిగినట్లు చెప్పారు.
ఇవీచూడండి: మందు భామలం మేము.. క్యూ కడతాము..!