ETV Bharat / state

BJP leader Laxman: కాంగ్రెస్‌కు తోక పార్టీలాగా తెరాస తీరు: లక్ష్మణ్ - bjp meet governer

BJP leader Laxman: ప్రధాని భద్రతా విషయంలో మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలు సరికాదని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ విమర్శించారు. తెరాస నాయకులు కాంగ్రెస్​కు వత్తాసు పలకడం రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​తో కలిసి గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించారు.

BJP leader Laxman
భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌
author img

By

Published : Jan 8, 2022, 9:13 PM IST

భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌

BJP leader Laxman: తెరాస కాంగ్రెస్‌కు తోక పార్టీలాగా వ్యవహరిస్తోందని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఆరోపించారు. ప్రధాని భద్రతా విషయంలో కేటీఆర్‌ బాధ్యతాలేకుండా మాట్లాడటం సరికాదని మండిపడ్డారు. దేశ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ నేతృత్వంలో రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ను కలిశారు.

ప్రధాని భద్రత విషయంపై గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించారు. ప్రధానికి ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ ఈనెల10న రాష్ట్రవ్యాప్తంగా మృత్యుంజయ హోమం నిర్వహించనున్నట్లు లక్ష్మణ్‌ స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు తెరాస వత్తాసు పలికినా మాకు ఎలాంటి అభ్యంతరం లేదని.. కానీ ప్రధాన మంత్రి భద్రత విషయంలో అవహేళనగా మాట్లాడితే సహించేందిలేదన్నారు. ప్రధాన మంత్రి భద్రత విషయంలో గవర్నర్‌కు అన్ని విషయాలు వివరించామని.. సానుకూలంగా స్పందించారని లక్ష్మణ్‌ అన్నారు. రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై మరింతగా ఉద్యమిస్తామన్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర రావు, భాజపా నేతలు ప్రకాశ్‌, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు గవర్నర్‌ను కలిసిన వారిలో ఉన్నారు.

భాజపా పట్ల అక్కసుతో తెరాస నేతలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ప్రధాని భద్రతపై బాధ్యతరహితంగా మంత్రి కేటీఆర్ మాట్లాడిన మాటలను ప్రజలు అసహ్యించుకుంటున్నారు. కాంగ్రెస్ నాయకుల మాటలకు మంత్రి వత్తాసు పలుకున్నాడు. కాంగ్రెస్ తోక పార్టీగా తెరాస తీరు ఉంది. ఈ దేశాన్ని ముక్కలు చేసేలా కాంగ్రెస్ నాయకులు ఇవాళ మాట్లాడుతుంటే వారికి వంత పాడుతున్న మంత్రి కేటీఆర్ తీరును ప్రజలు గమనిస్తున్నారు. మీరు చేసిన వ్యాఖ్యలకు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. కాంగ్రెస్ తీరును సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తప్పు పట్టకుండా మౌనం వహించడం సమంజసమా? ఇవాళ మీరు, మీ భాష చూస్తుంటే అదే దారిలో మీరు కూడా వెళ్తున్నారా? బండి సంజయ్​ జాగరణ దీక్ష చేస్తే దాన్ని అడ్డుకుని అరెస్టులు చేయడాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాని మోదీ మరింతకాలం సేవలు అందించాలని ఈనెల 10న మృత్యుంజయ హోమం నిర్వహిస్తున్నాం. ఈ విషయాన్ని గవర్నర్​ దృష్టికి తీసుకెళ్లాం. వారు సానూకులంగా స్పందించారు. దీనిని రాష్ట్రపతికి దృష్టికి కూడా తీసుకెళ్తాం.

-లక్ష్మణ్‌, భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.