ETV Bharat / state

ICMR SERO SURVEY: రాష్ట్రంలో 60 శాతం మందిలో కొవిడ్​ యాంటీ బాడీలు

author img

By

Published : Jul 23, 2021, 7:38 PM IST

Updated : Jul 24, 2021, 2:50 AM IST

రాష్ట్రంలో నాలుగో విడత నిర్వహించిన సీరో సర్వే ఫలితాల్లో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. దాదాపు 60 శాతం మందిలో కొవిడ్ యాంటీబాడీలు ఉన్నట్టు ఐసీఎంఆర్​ అనుబంధ సంస్థ ఎన్​ఐఎన్​ ప్రకటించింది. అయితే జాతీయ స్థాయిలో పోలిస్తే.. రాష్ట్రంలో 7 శాతం తక్కువగా సీరో పాజిటివిటీ నమోదైనట్లు తెలిపిన ఎన్​ఐఎన్​.. వ్యాక్సిన్ వేసుకున్న వారిలో సత్ఫలితాలు వస్తున్నట్టు స్పష్టం చేసింది.

ICMR SERO SURVEY
ICMR SERO SURVEY

దేశంలో కొవిడ్ వ్యాప్తి, వైరస్ నివారణ కోసం తీసుకుంటున్న చర్యలు ఏ మేరకు ఫలితాలు ఇస్తున్నాయనే వివరాలను తెలుసుకునేందుకు ఐసీఎంఆర్ ఎప్పటికప్పుడు దేశవ్యాప్తంగా సీరో సర్వేలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా చేపట్టిన సర్వేలో.. దేశ వ్యాప్తంగా 67 శాతం మందిలో కొవిడ్ సీరో పాజిటివ్​గా తేలినట్టు ప్రకటించింది. ఇక రాష్ట్రంలో ఐసీఎంఆర్ అనుబంధ సంస్థ ఎన్​ఐఎన్​.. జనగామ, నల్గొండ, కామారెడ్డి జిల్లాల్లో ఈ సర్వేని జూన్​లో చేపట్టగా... ఫలితాలను శుక్రవారం విడుదల చేసింది.

ఈ నివేదిక ప్రకారం... సర్వేలో పాల్గొన్న వారిలో 60 శాతం మందిలో కొవిడ్ యాంటీబాడీలు గుర్తించినట్టు స్పష్టం చేసింది. ఈ సర్వే కోసం అన్ని వయసుల వారి రక్త నమూనాలు సేకరించి విశ్లేషించారు. అయితే 6 నుంచి 9 ఏళ్ల లోపు 55 శాతం మందిలో మాత్రమే యాంటీబాడీలు గుర్తించగా.. 61 శాతం మంది పెద్దవారిలో యాంటీబాడీలు ఉన్నాయని తెలిపింది. ఇక హెల్త్ కేర్ వర్కర్లలో ఏకంగా 82.4 శాతం మందిలో కొవిడ్ యాంటీబాడీలు ఉన్నాయని నివేదికలో పేర్కొంది. ముందుగా వ్యాక్సిన్ తీసుకోవడమే ఇందుకు కారణమై ఉండొచ్చని.. అభిప్రాయపడింది.

కరోనా వ్యాప్తిని గుర్తించేందుకు గానూ ఐసీఎంఆర్ గతంలో సీరో సర్వే చేసిన జిల్లాల్లోనే.. మరోమారు సర్వే చేపట్టడం గమనార్హం. ఇప్పటికే ఆయా జిలాల్లో గతేడాది మే, ఆగస్ట్, డిసెంబర్ నెలల్లో సర్వే చేపట్టారు. అయితే మే నెలలో చేసిన సర్వేలో 0.33 శాతం, ఆగస్టులో 12.5 శాతం, డిసెంబర్​లో 24.5 శాతం మందిలో యాంటీబాడీలు గుర్తించగా.. తాజా సర్వేలో ఏకంగా 60 శాతం మందిలో యాంటీబాడీలు వృద్ధి చెందటం గమనార్హం. ఎన్​ఐఎన్​ తాజా నివేదిక ప్రకారం.. జనగామలో 58.76, నల్గొండలో 55.88, కామారెడ్డిలో అత్యధికంగా 65.61 శాతం మంది సీరో పాజిటివ్​గా గుర్తించారు.

ఇక దేశ వ్యాప్తంగా చేపట్టిన సర్వేలో 67 శాతం సీరో పాజిటివిటీ రేటు నమోదు కాగా.. రాష్ట్రంలో అది కేవలం 60 శాతం మాత్రమే కావడం గమనార్హం. ఇక వ్యాక్సిన్ తీసుకున్న వారిలో యాంటీబాడీల ఉత్పత్తిని ప్రకటించిన ఎన్​ఐఎన్​.. వ్యాక్సిన్ ఒక డోసు తీసుకున్న వారిలో 78.5 శాతం, రెండు డోసులు పూర్తైన వారిలో.. 94 శాతం మందిలో యాంటీబాడీలు ఉన్నట్టు ప్రకటించింది.

తాజా సర్వే ప్రకారం వ్యాక్సిన్ తీసుకున్న వారిలో.. మంచి ఫలితాలు ఉన్నట్టు గుర్తించామని తెలిపిన ఐసీఎంఆర్- ఎన్​ఐఎన్​.. ఇప్పటికి 40 శాతం మందికి ముంపు పొంచి ఉన్న నేపథ్యంలో.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కొవిడ్ నిబంధనలు పాటించడం ద్వారా... వైరస్ నుంచి రక్షించుకోవచ్చని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: Floods in TS: ముంపు ప్రాంతాల్లో మంత్రులు... అధికారులకు పలు సూచనలు

Last Updated : Jul 24, 2021, 2:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.