ప్రముఖ సినీనటుడు నర్సింగ్ యాదవ్ అంత్యక్రియలు ముగిశాయి. హైదరాబాద్ సుల్తాన్ బజార్లోని ఆయన నివాసం నుంచి గోల్నాక శ్మశాన వాటిక వరకు అభిమానులు అంతిమయాత్ర నిర్వహించి తుది వీడ్కోలు పలికారు. కుమారుడు రుత్విక్ యాదవ్.. తండ్రికి అంతిమసంస్కారాలు చేశారు.
అంతకుముందు నర్సింగ్ యాదవ్ నివాసానికి అభిమానులు, పలు రాజకీయ పార్టీల నాయకులు, స్థానికులు చేరుకొని ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు.
ఇదీ చదవండి: జీహెచ్ఎంసీ పాలకవర్గం ఏర్పాటులో తాత్సారం తగదు: బండి