ETV Bharat / state

కుప్పంలో ఉత్సాహంగా నారా లోకేశ్​ పాదయాత్ర..

LOKESH YUVAGALAM PADAYATRA IN KUPPAM : ప్రజల గుండె చప్పుడు విని వారికి భరోసా ఇచ్చేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ‘యువగళం’ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఆంధ్రప్రదేశ్​లోని చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలో గల లక్ష్మీపురంలోని ఉన్న శ్రీవరదరాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపి.. తొలి అడుగు వేశారు. ఈ యాత్రలో అనుకోని సంఘటన జరిగింది. నటుడు తారకరత్న అభిమానుల తాకిడి తట్టుకోలేక సొమ్మసిల్లి పడిపోయారు.

Nara Lokesh Padayatra started in Kuppam
కుప్పంలో నారా లోకేశ్​ పాదయాత్ర మొదలయింది
author img

By

Published : Jan 27, 2023, 1:13 PM IST

Updated : Jan 27, 2023, 2:57 PM IST

LOKESH YUVAGALAM PADAYATRA IN KUPPAM : యువత భవిత, ఆడబిడ్డల రక్షణ కోసం, అవ్వా తాతల బాగోగుల కోసం.. దగా పడ్డ వివిధ వర్గాలకు తోడు కోసం అంటూ తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ కదం తొక్కారు. యువగళం పేరిట 4వేల కిలోమీటర్ల సుధీర్ఘ పాదయాత్ర ప్రారంభించారు. ఏపీ రాష్ట్ర అభివృద్ధికి వారధిగా నిలుస్తానంటూ.. 400 రోజుల పాటు 4వేల కిలోమీటర్లకు పైగా నడిచేందుకు... పాదయాత్ర చేపట్టారు. కుప్పంలోని లక్ష్మీపురం శ్రీ ప్రసన్న వరదరాజ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం సరిగ్గా 11.03 గంటలకు ఆలయం వద్ద నుంచి తొలి అడుగు వేసి పాదయాత్ర ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ కాలి నడకన తిరిగి క్షేత్ర స్థాయి పరిస్థితులను కళ్లారా లోకేశ్‌ చూడనున్నారు. కుప్పంలో ప్రారంభమైన ఈ పాదయాత్ర.. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగియనుంది. లోకేశ్‌ పాదయాత్రకు తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

కుప్పంలో ట్రాఫిక్ జామ్ అవ్వటంతో నందమూరి బాలకృష్ణ ద్విచక్ర వాహనంపై ఆలయం వద్దకు వచ్చారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, సీనియర్ నేతలు కుప్పం వచ్చి లోకేశ్‌ పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. భారీ తరలి వచ్చిన పార్టీ శ్రేణులు, నేతలతో కలిసి లోకేశ్‌ ముందుకు కదిలారు. మధ్యాహ్నం 3 గంటలకు కుప్పంలో బహిరంగ సభను నిర్వహించనున్నారు.

  • యువత భవిత కోసం...
    ప్రజల బతుకు కోసం...
    రాష్ట్ర భవిష్యత్ కోసం...

    All the best to #YuvaGalamPadayatra

    — N Chandrababu Naidu (@ncbn) January 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

పాదయాత్రలో సొమ్మసిల్లి పడిపోయిన తారకరత్న: సినీనటుడు నందమూరి తారకరత్న సొమ్మసిల్లి పడిపోయారు. నారా లోకేశ్‌ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. కుప్పం సమీపంలోని లక్ష్మీపురం శ్రీవరదరాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం పాదయాత్ర ప్రారంభమైంది. అనంతరం కొద్ది దూరం నడిచిన తర్వాత మసీదులో లోకేశ్‌ ప్రార్థనలు నిర్వహించారు. లోకేశ్‌తో పాటు తారకరత్న కూడా అందులో పాల్గొన్నారు. మసీదు నుంచి బయటకు వచ్చే సమయంలో పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు, అభిమానుల తాకిడికి తారకరత్న సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే స్థానిక నేతలు ఆయన్ను కుప్పంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది.

లోకేశ్​కు ఆల్​ ది బెస్ట్​ చెపుతూ చంద్రబాబు ట్వీట్​: యువగళం పాదయాత్రకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ట్విటర్‌ ద్వారా లోకేష్ పాదయాత్రకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. యువత భవిత కోసం..ప్రజల బతుకు కోసం.. రాష్ట్ర భవిష్యత్ కోసం..లోకేశ్‌ పాదయాత్ర అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

ఇవీ చదవండి:

Last Updated : Jan 27, 2023, 2:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.