ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పాలనలో ఆడబిడ్డలపై అఘాయిత్యాలు ఎక్కువైపోతున్నాయని... మహిళలకు భద్రత లేకుండా పోయిందని... తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళల భద్రతపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సమయంలోనే.. గుంటూరు జిల్లాలో మరో దారుణం జరగడం బాధాకరమన్నారు.
బైక్‌పై వెళ్తున్న జంటపై నలుగురు దాడి చేసి మహిళపై అత్యాచారానికి పాల్పడడం ఆ రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేసిందన్నారు. ఫిర్యాదు చెయ్యడానికి వెళ్తే తమ పరిధిలోకిరాదంటూ.. వేరే స్టేషన్‌కు వెళ్లండంటూ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఇంకా ఘోరమని లోకేశ్ దుయ్యబట్టారు. ఇంత విచ్చలవిడిగా మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా... ప్రభుత్వంలో చలనం లేదని విమర్శించారు. ఆడబిడ్డని కోల్పోయిన కుటుంబాన్ని పరామర్శించకుండా... అక్కడకు వెళ్తున్న తమని అడ్డుకోవడానికి మాత్రం వేలాది మంది పోలీసుల్ని రంగంలోకి దింపారని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులను రాజకీయ కక్ష సాధింపులకి ముఖ్యమంత్రి వాడుకోవడం వల్లే .. రాష్ట్రానికి ఈ దుస్థితి వచ్చిందని లోకేశ్ ధ్వజమెత్తారు.
ఇదీ చూడండి: Rape: విద్యాసంస్థలో పీడీగా చేస్తూ.. కూతురిపై వాంఛ తీర్చుకున్న తండ్రి