కాన్సర్ చికిత్సకు ప్రపంచస్థాయి వైద్యం అందించాలనే ఉద్దేశంతో బసవతారకం ఆసుపత్రిని స్థాపించినట్లు నారా బ్రాహ్మణి తెలిపారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా కొన్నేళ్లుగా అంతర్జాతీయ స్థాయి వైద్యాన్ని బసవతారకం కేన్సర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో అందిస్తున్నామని పేర్కొన్నారు.
అంతర్జాతీయ చిన్నపిల్లల కాన్సర్ దినోత్సవాన్ని బసవతారకం కాన్సర్ ఆస్పత్రిలో నిర్వహించారు. కాన్సర్ బారిన పడి చికిత్స పొందుతున్న చిన్నపిల్లలకు ప్రోత్సాహకం అందించారు. చికిత్స పొందుతున్న చిన్నారుల్లో దాగున్న ఆత్మవిశ్వాసం చూసి ఎంతో స్పూర్తి పొందానని తెలిపారు.
కాన్సర్ ఆసుపత్రి నిర్వహణ అంత సులభం కాదు. ఎన్నో వ్యయప్రయాసలకోర్చాల్సి ఉంటుంది. దూరదృష్టి గల నాయకులు, వైద్యుల వల్లే ఆసుపత్రిని ఇంత విజయవంతంగా నడపగలుగుతున్నాం. కాన్సర్ విజేతలైన చిన్నారుల విజయగాథల నుంచి ఎంతో స్ఫూర్తి పొందవచ్చు. చిన్నారులు, యువకుల్లో కాన్సర్‌పై అవగాహన పెంచాలి. త్వరగా వ్యాధి నిర్థరణ, చికిత్స, నయం చేయడం అత్యవసరం.
-నారా బ్రాహ్మణి, బోర్డు సభ్యురాలు