ETV Bharat / state

నాలాకు సమాధి: పరిస్థితి ఇలాగే కొనసాగితే వరద ముప్పును అడ్డుకోలేం - బుల్కాపూర్​ నాలా ఆక్రమణ

శంకర్‌పల్లి పరిధిలోని బుల్కాపూర్‌ నుంచి హుస్సేన్‌సాగర్‌ వరకు వరదను సాఫీగా తీసుకొచ్చే బుల్కాపూర్‌ నాలాకు ఆక్రమణదారులు సమాధి కట్టారు. ఒకప్పుడు ప్రధాన నగరానికే పరిమితమైన ఆక్రమణలు.. ఇప్పుడు కోకాపేట, మణికొండ ప్రాంతాల్లో శ్రుతిమించాయి. మణికొండలో రెండు కిలోమీటర్ల మేర పూడ్చి నిర్మాణాలు చేపట్టారు. ఓయూకాలనీ, షేక్‌పేట, లక్ష్మీనగర్‌, తర్వాతి ప్రాంతాల్లోనూ ఇరువైపులా ఉన్న నిర్మాణాలు.. లోపలికి కొద్దికొద్దిగా జరుగుతున్నాయి. చక్కదిద్దాల్సిన అధికారులు ముడుపులు తీసుకుని చేతులు దులిపేసుకుంటున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే వరద ముప్పు బాహ్యవలయ రహదారి(ఓఆర్‌ఆర్‌) దాటి విస్తరించే ప్రమాదం కనిపిస్తోందని ‘ఈనాడు-ఈటీవీ భారత్​’ క్షేత్రస్థాయి పరిశీలనలో స్పష్టమైంది.

nala-issues-in-hyderabad
నాలాకు సమాధి: పరిస్థితి ఇలాగే కొనసాగితే వరద ముప్పును అడ్డుకోలేం
author img

By

Published : Jun 23, 2021, 12:30 PM IST

గతేడాది నగరంలో తలెత్తిన వరద సమస్యను దృష్టిలో ఉంచుకుని ఆక్రమణల చెరలో కూరుకుపోతున్న బుల్కాపూర్‌ నాలా పరిస్థితిని ‘ఈనాడు-ఈటీవీ భారత్​’ క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ఓఆర్‌ఆర్‌(OUTER RING ROAD) వెలుపలి నుంచి మణికొండ మల్లన్నస్వామి గుట్ట వరకు నాలా ప్రవాహ మార్గం అస్తవ్యస్తంగా మారింది. మధ్యలో వెంచర్లు వచ్చాయి. అక్కడి నుంచి చిత్రపురి కాలనీ సమీపంలోని ఎల్లమ్మ చెరువు వరకు ఆక్రమణదారులు నాలాను మట్టితో పూడ్చేసి రోడ్లు వేసుకున్నారు. ఎల్లమ్మ చెరువు నుంచి రాయదుర్గం వరకు నాలా సాఫీగా సాగుతుంది. అక్కడున్న డైవర్షన్‌ ఛానెల్‌(Diversion Channel)ను దాటుకుని ఓయూకాలనీ మీదుగా షేక్‌పేట వైపు ప్రవహించేటప్పుడు ఆటంకాలు వచ్చాయి. ఓయూకాలనీలో నాలా 20-30అడుగుల లోతున ప్రవహిస్తుంది. అక్కడ విశాలమైన బఫర్‌ జోన్‌(Buffer Zone) ఉండేది. ఇప్పుడు ఆ ప్రాంతంలో నిర్మాణాలొచ్చాయి.

షేక్‌పేట గ్రామంలోకి ప్రవేశించగానే మరో భారీ నిర్మాణ ప్రాజెక్టు బఫర్‌జోన్‌(Buffer Zone)ను ఆక్రమించింది. అల్‌హమ్రా కాలనీలో నాలాలోకి నిర్మాణాలు చేపట్టారు. షేక్‌పేట శ్మశానవాటిక వద్ద రెండు అడుగులకు కుంచించుకుపోయింది. వివేకానందనగర్‌ కాలనీలోనూ మొత్తం నిర్మాణాలే. షేక్‌పేట నాలా రోడ్డును దాటుకుని లక్ష్మీనగర్‌లోకి ప్రవేశించగానే.. సగ భాగం కబ్జాకు గురైంది. బస్తీ వెలిసింది. లక్ష్మీనగర్‌ నిర్మాణాలూ నాలాలోకి వెళ్లాయి. ఇలా వెళ్లిన వరదంతా షేక్‌పేట కొత్తచెరువులో కలుస్తోంది. కొత్తచెరువు తూము నుంచి మళ్లీ బల్కాపూర్‌ నాలా ప్రయాణం మొదలవుతుంది. ఎంజీ నగర్‌, షేక్‌పేట హకీంషా విరాఠ్‌నగర్‌, బృందావన్‌కాలనీ, ఫాతిమానగర్‌, హకీంపేట, టోలిచౌకీ నిజాంకాలనీ, ఆర్మీ స్థావరం, పోచమ్మబస్తీ, ఫించన్‌ ఆఫీసు, చింతలబస్తీ, ఖైరతాబాద్‌, మారుతీనగర్‌ మీదుగా వెళ్లి హుస్సేన్‌సాగర్‌లో కలుస్తుంది. ఈ మధ్యలో పరిస్థితి అధ్వానంగా ఉంది. హకీంపేట, టోలిచౌకీ ప్రాంతాల్లో పలు చోట్ల వెడల్పు ఐదు నుంచి మూడు అడుగులకు కుదించుకుపోతోంది.

తెగిన గొలుసుకట్టు..

ఓఆర్‌ఆర్‌ వెలుపలి వరదతోపాటు మణికొండ ఎల్లమ్మచెరువు, ఖాజాగూడ చెరువు, బండ్లచెరువు, దుర్గంచెరువు, మల్కంచెరువుల వరదను బుల్కాపూర్‌ నాలా హుస్సేన్‌సాగర్‌కు తీసుకెళ్తుంది. వరద ఎక్కువగా వస్తే కొంత వరద రాయదుర్గంలోని మరో నాలాలలోకి మళ్లి.. నెక్నాంపూర్‌ వైపు సాగుతుంది. ఇప్పుడు ఆయా చెరువుల మధ్య నాలాలు ఆక్రమణకు గురవడంతో ఎక్కడి వరద అక్కడే సమీప ప్రాంతాలను ముంచెత్తుతోంది. గతేడాది వరదలతో మణికొండలో వరద ముంపు తీవ్రమైంది. అంజలీగార్డెన్‌, పుప్పాలగూడ రోడ్డు నడుములోతున మునిగింది. పంచవటికాలనీ సెల్లార్లు, అపార్ట్‌మెంట్లు మునిగాయి. చక్కదిద్దాల్సిన అధికారులు ముడుపులు తీసుకుని చేతులు దులిపేసుకుంటున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే వరద ముప్పు బాహ్యవలయ రహదారిని చేరిపోవడం ఖాయం.

ఇదీ చూడండి: Cm Kcr: ఊరంతా కలిస్తేనే అభివృద్ధి... అప్పుడే బంగారు వాసాలమర్రి సాధ్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.