వజీర్ సుల్తాన్ టుబాకో కంపెనీ కార్మికుల సంక్షేమం కోసం గత మూడు పర్యాయాలుగా కృషి చేశానని మాజీ హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి అల్లుడు కార్పొరేటర్ వీ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వచ్చే నెల 6న జరిగే వీఎస్టీ కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో తనను గెలిపించాలని కార్మికులను కోరారు.
అడిక్ మెట్ డివిజన్లోని కట్ట మైసమ్మ దేవాలయంలో శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఊరేగింపుగా ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని కార్మికశాఖ కార్యాలయానికి వచ్చారు. జై భవాని ఎన్ఎన్ఆర్ గ్రూప్ నుంచి శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.
ఇదీ చదవండి: బేబీబంప్‌తో అనుష్క శర్మ.. ఫొటోలు వైరల్