హైదరాబాద్ నగరంలో మాంసం దుకాణాలపై జీహెచ్ఎంసీ, పశుసంవర్ధక శాఖ అధికారులు తనిఖీలు చేశారు. లాక్డౌన్ సమయంలో కల్తీ మాంసం ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారనే సమాచారంతో నిరంతరం అధికారులు దాడులు నిర్వహించారు. ఇవాళ నిర్వహించిన దాడుల్లో పంజాగుట్టలోని ఏ1 మటన్ దుకాణాన్ని సీజ్ చేశారు.
ఎక్కువ రోజుల మటన్‌ను ఫ్రిజ్‌లో స్టోర్ చేసి విక్రయిస్తున్నారని.. దుకాణంలో ఎక్కువ మంది పనిచేస్తున్నరని అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూ.700కు కేజీ అమ్మాల్సి ఉంది. కానీ ఎక్కువ రేట్లకు విక్రయిస్తున్నారని పేర్కొన్నారు.
ఇదీ చూడండి : రాష్ట్రంలో 1500 దాటిన కరోనా పాజిటివ్ కేసులు