వినాయక చవితి వచ్చిందంటే దేశవ్యాప్తంగా హిందువులు వాడవాడలా గణేష్ వేడుకలు జరుపుకోవడం మనకు తెలిసిందే.. కానీ జూబ్లిహిల్స్ నియోజకవర్గం రహమత్‌నగర్ డివిజన్లోని కార్మికనగర్‌లో మత సామరస్యానికి అద్దం పడుతూ గణేష్ నవరాత్రులు నిర్వహిస్తారు. గణపతి వేడుకలను ఓ ముస్లిం యువకుడు దగ్గరుండి మరీ నిర్వహిస్తాడు. పూజలో, వేడుకల్లోను పాల్గొంటూ..అన్ని కార్యక్రమాలు అతనే పర్వవేక్షిస్తున్నాడు షేక్ ఉమర్.
కేబుల్ వ్యాపారి అయిన ఉమర్ తన స్నేహితులతో కలిసి ఫ్రెండ్స్ యూత్ ఫెడరేషన్ తరఫున ఆటోస్టాండ్‌లో గణేశ్ ఉత్సవాలు నిర్వహిస్తున్నాడు. పదేళ్ల నుంచి వేడుకలు చేసే ఉమర్... ఇది తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిందని చెబుతున్నాడు. తమ బస్తీవాళ్లంతా ఏ మతస్తులైనా అన్ని పండుగలు కలిసే చేసుకుంటామని చెబుతున్నారు ఉమర్. అంతా కలిసి అన్నదమ్ముల్లా మతసామరస్యానికి జీవంపోస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ బస్తీవాసులు.
ఇదీ చూడండి: ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనానికి పటిష్ట ఏర్పాట్లు