పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా సోమవారం రాత్రి హైదరాబాద్ పాతబస్తీలో నిరసన తెలిపారు. దారుల్ షిఫా ప్రాంతంలోని మసీదు ముందు మైదానంలో ముస్లింలు ఆందోళన నిర్వహించారు. మహిళా సంఘాల నేతలు, ప్రతినిధులు, ముస్లిం మహిళలు, యువకులు, ఫ్ల కార్డుల పట్టుకుని పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ శాంతి ర్యాలీ నిర్వహించారు. కేవలం రాజకీయాల కోసం మతపరమైన రాజ్యాంగాన్ని మార్చారాని తెలంగాణ ఉమెన్ ఆర్గనైజేషన్ జాక్ నేత సజయ ఆరోపించారు. దిల్లీలో విద్యార్థులపై పోలీసుల దాడి అమానుషమన్నారు.
ఇదీ చూడండి : పెరిగిన మద్యం ధరలు... ఎల్లుండి నుంచి అమల్లోకి...