Musi flood water: మూసీకి భారీగా చేరుతున్న వరదతో పరివాహక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్‌నుంచి భారీగా వరదనీరు దిగువకు వస్తుండటంతో మూసీ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో సహయక బృందాలు లోతట్టు ప్రాంత వాసులను పునరావాస కేంద్రాలకు తరలించారు.
ఉస్మాన్ సాగర్ 15 గేట్లకు గాను.. 13 గేట్లు ఎత్తి 8 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. మరో గేటును సైతం ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఉందని అధికారులు ఇప్పటికే హెచ్చరించారు. వరదనీరు ఉద్ధృతికి అధికారులు చర్యలు చేపట్టారు. ఇళ్లు నీట మునిగిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి ముందస్తు చర్యలు తీసుకున్నారు.
జంట జలాశయాలకు తగ్గుతున్న వరద ఉద్ధృతి: జంట జలాశయాలకు తగ్గుతున్న వరద ఉద్ధృతి క్రమక్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం ఉస్మాన్‌సాగర్ ఇన్‌ఫ్లో 7,500 క్యూసెక్కులు కాగా.. ఔట్‌ఫ్లో 8,281 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుతం 13 గేట్లు 6 ఫీట్ల మేర ఎత్తి నీటి విడుదల చేస్తున్నారు. జలాశయ పూర్తిస్థాయి నీటిమట్టం 1790 అడుగులు కాగా.. ప్రస్తుతం 1788.80 అడుగులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. హిమాయత్‌సాగర్ ఇన్‌ఫ్లో 7వేల క్యూసెక్కులు కాగా.. 8 గేట్లు ఎత్తి 7,708 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1763 అడుగులు.. ప్రస్తుతం నీటిమట్టం 1761 అడుగులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి: ఎన్నికలెపుడొచ్చినా ఎదుర్కొనేందుకు భాజపా సిద్ధం: బండి సంజయ్