ETV Bharat / state

MUSHEERABAD SEWERS: మురికికూపంగా మారిన ముషీరాబాద్ కాలనీలు - TELANGANA LATEST NEWS

ఆ ప్రాంతాల్లో కాలుపెట్టాలంటేనే భయపడిపోతుంటారు. నీరు తాగాలన్నా, చివరకు కాళ్లు కడుక్కోవాలనుకున్నా మొహం చిట్లిస్తారు. ఎందుకలా అనుకుంటున్నారా..! అక్కడ మురుగునీరు నిరంతరం జీవనదుల్లా పొంగిపొర్లుతూనే ఉంటుంది. ఆ ప్రాంతమంతా దుర్వాసన, దోమలతో నిండిపోయింది. ఆ ప్రాంత ప్రజలందరూ ఎప్పుడూ ఏదో అనారోగ్యానికి గురవుతూనే ఉంటారు. దీనంతటికీ కారణం అక్కడ డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడమే...!

musheerabad-people-facing-problems-with-sewers
మురికికూపంగా మారిన ముషీరాబాద్ కాలనీలు
author img

By

Published : Jul 21, 2021, 10:37 AM IST

హైదరాబాద్ ముషీరాబాద్ నియోజవర్గంలో మురుగునరు నిరంతరం జీవనదుల్లా పొంగిపొర్లుతూనే ఉంటుంది. ఆదర్శకాలనీ, ఫ్రెండ్స్ కాలనీ, రాంగనర్, చేపల మార్కెట్, అడిక్ మెట్ ఏరియా, లక్ష్మాపార్క్, ఎస్.ఆర్.టీ క్వార్టర్స్, రామాలయం వెనక ప్రాంతంలో అయితే ప్రతి రోజూ మురుగు నీరు వరదల రూపంలో పారుతూనే ఉంటుంది. కేవలం వర్షాకాలంలోనే కాదండోయ్... మూడు కాలాల పాటు మురుగు నీరు పరుగు పెడుతూనే ఉంటుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 30 ఏళ్లుగా ఈ సమస్యను ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. అధికారులకు, ప్రజా ప్రతినిధులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా... వచ్చి చూసి పోతున్నారే తప్ప శాశ్వత పరిష్కారం చూపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో సికింద్రాబాద్, ఉప్పల్ ప్రాంతంలో ఎక్కడ వరదలు వచ్చినా.. ముషీరాబాద్ నియోజకవర్గంలోకి వచ్చి చేరిపోతుంటాయి.

నిజాం కాలం నాటి మురుగు కాల్వలు...

ఎప్పుడో నిజాం కాలంలో నిర్మించిన మురుగు కాల్వలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. అవి పాడైపోయాయని... బాగుచేయాలని స్థానికులు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా... ఏ ప్రభుత్వమూ పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఫిర్యాదు చేసినప్పుడు అధికారులు, ప్రజాప్రతినిధులు రావడం... వాటికి సంబంధించిన లెక్కలు వేసుకోవడం తర్వాత వదిలేయడం షరామామూలుగా మారిపోయిందని వాపోతున్నారు. ఎప్పుడు అడిగినా కొత్త మురుగు లైన్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్నారే తప్ప వాటిని పూర్తి చేయడం లేదని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో సుమారు 5 లక్షల మందికి పైగా నివసిస్తున్నారు. డ్రైనేజీల కారణంగా తాగే నీటితో సహా మొత్తం నీళ్లన్నీ కలుషితమయ్యాయని... ఫలితంగా అనారోగ్యాల పాలవుతున్నామని అంటున్నారు. అడుగు తీసి అడుగు బయట వేయాలంటే ముక్కు మూసుకుని వెళ్లాల్సిన దుస్థితి ఎదురవుతుందని వాపోతున్నారు.

నాగమయ్యకుంటలో పడి చాలామంది చనిపోయారు...

ఈ నియోజకవర్గంలోనే ఉండే నాగమయ్య కుంట...మోస్తరు వర్షానికే పొంగిపొర్లుతుంది. ఈ కుంటలో అనేకమంది పడి మరణించిన ఘటనలు కూడా ఉన్నాయి. భారీ వర్షాలు వచ్చినప్పుడైతే కార్లు, ద్విచక్రవాహనాలు కొట్టుకుని వస్తున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. కొన్నిసార్లు మనుషులు కూడా కొట్టుకువచ్చారంటున్నారు. నాగమయ్య కుంట వద్ద తూములు పూర్తిగా మూసుకుపోయాయని... వర్షాకాలం వచ్చినా వాటిని బాగు చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంచెం పెద్ద వర్షమొచ్చినా నీరంతా తూముల్లోకి వెళ్లకుండా రోడ్లపైకి వస్తుందంటున్నారు. సికింద్రాబాద్​లోని గాంధీ ఆసుపత్రి, వినోభా నగర్, అడిక్ మెట్, విద్యానగర్, రాంనగర్ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన మురుగు నీరంతా నాగమయ్యకుంటలో కలుస్తుందని... అది పొంగగానే ఇళ్లలోకి చేరుతుందని స్థానికులు పేర్కొంటున్నారు. మరోపక్క ఈ ప్రాంత పరిధిలోకి వచ్చే హుస్సేన్ సాగర్ నాల వాల్స్ ఎక్కడిక్కడ ధ్వంసమైపోయాయని... వాటికి సంబంధించిన కల్వర్టులకు అధికారులు మరమ్మత్తులు కూడా చేయడం లేదని ఆరోపిస్తున్నారు.

కలుషిత నీరు తాగుతూ... రోగాలతో

అసలే వర్షాకాలం సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాటికితోడు మురుగునీటితో కలుషితమైతే... మరిన్ని వ్యాధులు ప్రబలే అవకాశముందని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికే తాగునీరు కలుషితమై అనారోగ్యాల పాలయ్యామని... ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి మురుగు నీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.