హైదరాబాద్ లక్డీకాపుల్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ అభినందన సభ జరిగింది. ఈ సభకు ముఖ్యఅతిథిగా ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజరయ్యారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని చెప్పారు.
వాసవి కేంద్రంలో గృహకల్ప షాపుల క్రమబద్ధీకరణపై ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌తో మాట్లాడతానని తెలిపారు. 1996లో వచ్చిన జీవో ద్వారా హౌసింగ్ బోర్డు కొన్ని షాపులను క్రమబద్ధీకరించిందని బంగారు మా తెలంగాణ గృహకల్ప మార్కెట్ వేదిక అధ్యక్షుడు యంవీ జనార్దన్ తెలిపారు.
ఇదీ చదవండి: లైవ్ వీడియో: ప్రైవేటు బస్సు బీభత్సం