ETV Bharat / state

తలపై బండరాయితో కొట్టి.. దారుణంగా చంపేసి..! - గోల్కొండలో వ్యక్తి దారుణహత్య

హైదరాబాద్​ గోల్కొండ పోలీస్​స్టేషన్​ పరిధిలోని అల్జాపూర్​లో ఓ వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు బండరాయితో మోది దారుణంగా హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసును దర్యాప్తు చేస్తున్నారు.

murder_at_golconda in hyderabad by hitting with stone
తలపై బండరాయితో కొట్టి.. దారుణంగా చంపేశారు!
author img

By

Published : Jun 5, 2020, 12:08 PM IST

హైదరాబాద్​ గోల్కొండ పీఎస్​ పరిధిలోని అల్జాపూర్​లో ఓ గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా.. అక్కడే ఉన్న యాక్టివా వాహనంలో కొన్ని పత్రాల ద్వారా మృతుడు మల్లెపల్లి నివాసి రాహుల్​చంద్​ అగర్వాల్​గా పోలీసులు గుర్తించారు.

అతన్ని గుర్తుతెలియని దుండగులు తలపై బండరాయితో మోది దారుణంగా చంపేసినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. హత్యకు గల కారణాలను కేసును దర్యాప్తు చేసి తెలుసుకోనున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.