ETV Bharat / state

మద్యం మత్తులో స్నేహితుడిని చంపాడు..! - మద్యం మత్తులో స్నేహితుడిని చంపాడు

మద్యం మత్తులో ఇద్దరు స్నేహితులు గొడవకు దిగారు. ఒకరినొకరు గాయపరుచుకున్నారు. ఘటనలో గాయపడిన సర్వర్​ అనే వ్యక్తి ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు.

మద్యం మత్తులో స్నేహితుడిని చంపాడు..!
మద్యం మత్తులో స్నేహితుడిని చంపాడు..!
author img

By

Published : Jan 15, 2020, 7:20 AM IST

మద్యం మత్తులో స్నేహితుడిని చంపాడు..!
హైదరాబాద్ బంజారాహిల్స్​లోని శంకర్ నగర్​లో నివాసం ఉండే సర్వర్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. అదే కాలనీలో నివసిస్తున్న మిత్రుడే.. సర్వర్​ను చంపినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధరణకు వచ్చారు. మృతుడు సర్వర్ అలియాస్ చోటుకు 21 ఏళ్లు.

ఘటనా స్థలంలో మందు బాటిల్, మృతదేహంపై కత్తి ఆనవాళ్లు ద్వారా మద్యం మత్తులో ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. గొడవలో గాయపడిన సర్వర్​ను ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. తమకు న్యాయం చేయాలని మృతుడి తండ్రి డిమాండ్ చేశాడు.

ఇవీ చూడండి: కారు ఢీ కొని హెడ్​కానిస్టేబుల్ మృతి

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.