జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత భాజపా బలం పెరుగుతుందని తెరాస తగ్గుతుందని ఆ పార్టీ సీనియర్ నేత మురళీధర్‌రావు అన్నారు. ఈ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ కనుమరుగవుతుందని చెప్పారు.
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భాజపా ప్రత్యామ్నాయం కాబోతుందని పేర్కొన్నారు. తెరాస భయాలు సృష్టించి.. ఓట్ల లబ్ది పొందుతుందని ఆరోపించారు. దుబ్బాకలో భాజపా విజయంతో తెరాస నేతల్లో భయం పట్టుకుందని విమర్శించారు.
తెరాస మేనిఫెస్టోపై భాజపా అభిప్రాయాలను ప్రజలు అంగీకరించారని మురళీధర్‌రావు అన్నారు. ఉచిత హామీలు కురిపిస్తే ప్రజలు నమ్మె పరిస్థితి లేదన్నారు. తెరాస, మజ్లిస్.. భూ అక్రమాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు.
ఇవీచూడండి: కేసీ రావు, కేటీ రావు.. తెలంగాణకు ఏమీ రావు: తేజస్వీ సూర్య