ETV Bharat / state

త్వరలో టాస్క్​ఫోర్స్​ బృందాలు, ఎన్​ఫోర్స్​మెంట్​ స్క్వాడ్​లు.!

author img

By

Published : Feb 9, 2021, 11:44 AM IST

రాష్ట్రంలో అక్రమ నిర్మాణాలపై పురపాలక శాఖ ఉక్కుపాదం మోపింది. అందుకోసం టీఎస్​- బీపాస్​లో భాగంగా ప్రతి జిల్లాలో టాస్క్​ఫోర్స్​ బృందాలు, ఎన్​ఫోర్స్​మెంట్​ స్క్వాడ్​లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అక్రమ నిర్మాణాలని తేలితే ఎలాంటి నోటీసులు లేకుండానే వాటిని కూల్చివేయొచ్చని తెలిపింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్​ కుమార్​ ఉత్తర్వులు జారీ చేశారు.

arvind kumar, illegal constructions
అర్వింద్​కుమార్​, అక్రమ నిర్మాణాలు

స్వీయ ధ్రువీకరణ ద్వారా భవన నిర్మాణ అనుమతులకు తీసుకువచ్చిన టీఎస్‌- బీపాస్‌లో భాగంగా రాష్ట్రంలో జిల్లా స్థాయిలో టాస్క్‌ఫోర్స్‌ బృందాలు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ స్క్వాడ్‌లను ఏర్పాటు చేయాలని పురపాలక శాఖ నిర్ణయించింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్​ కుమార్​ ఉత్తర్వులు జారీ చేశారు.

పకడ్బందీ చర్యలు

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ స్క్వాడ్‌లలో రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపకదళం, రహదారులు, భవనాలశాఖ అధికారులు ఉండాలని అర్వింద్​కుమార్​ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన భవనాలను కూల్చివేయడానికి అవసరమైన బృందాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ స్క్వాడ్‌లు నిర్దేశించిన సమయంలో తనిఖీలు చేయాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణ అనుమతులు తీసుకోవడం లేదా ఫిర్యాదుల ఆధారంగా చర్యలు తీసుకోవాలని వివరించారు. పోర్టల్‌, కాల్‌ సెంటర్లు, మొబైల్‌ యాప్‌ ద్వారా వచ్చే ఫిర్యాదులపై మూడు రోజుల్లో పరిశీలించి అక్రమమని తేలితే ఎలాంటి నోటీసు లేకుండానే కూల్చివేయాలని స్పష్టం చేశారు.

యజమానులే చెల్లించాలి

అక్రమ నిర్మాణాలతో కలిగే నష్టాలపై విస్తృత ప్రచారం చేయాలని ముఖ్య కార్యదర్శి అన్నారు. కూల్చివేతకు అయ్యే వ్యయాన్ని అంచనా వేసి యజమాని నుంచే వసూలు చేయాలని సూచించారు. అంతకు ముందు పంచనామా నిర్వహించి రికార్డు చేయాలని పేర్కొన్నారు. అక్రమ నిర్మాణం లేదా లేఅవుట్ గురించి డీటీఎఫ్‌ రిజిస్ర్టేషన్లకు అవకాశం లేకుండా సబ్​రిజిస్ట్రార్లకు తెలియజేయాలని అర్వంద్​ తెలిపారు. అక్రమ నిర్మాణం కూల్చివేయకుండా ఉండే భాగాన్ని సీజ్‌ చేయాలని వెల్లడించారు.

జరిమానా

ఎవరైనా యజమాని ఉద్దేశపూర్వకంగా, నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేస్తుంటే.. కూల్చివేతతో పాటు స్థలం విలువలో 25 శాతం జరిమానా విధించడంతో పాటు మూడేళ్ల జైలు శిక్షకు చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మున్సిపాలిటీ, నగరపాలక సంస్థల వారీగా జిల్లాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాలను ఏర్పాటు చేసి ఈ నెల 18 లోపు వివరాలను ప్రభుత్వానికి తెలియజేయాలని కలెక్టర్లకు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: ఆరువేల మంది మహిళలు... బేతంచర్లకు గీటురాళ్లు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.