ETV Bharat / state

అత్యాచారం చేసిన నిందితులను శిక్షించాలని ఎమ్మార్పీఎస్​ ధర్నా

ఎస్సీ అమ్మాయిపై అత్యాచారం చేసిన 139 మంది నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేస్తూ ఎమ్మార్పీఎస్​, రాష్ట్ర ఎరుకల సంఘం నాయకులు ధర్నా నిర్వహించారు. అత్యాచారంపై సిట్టింగ్​ జడ్జి విచారణ జరిపించాలని డిమాండ్​ చేశారు.

mrps protested at tankbund in hyderabad
అత్యాచారం చేసిన నిందితులను శిక్షించాలని ఎమ్మార్పీఎస్​ ధర్నా
author img

By

Published : Aug 26, 2020, 4:00 PM IST

ఎస్సీ అమ్మాయిపై జరిగిన అత్యాచారంపై సిట్టింగ్ జడ్జి విచారణ జరిపించాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, రాష్ట్ర ఎరుకల సంఘం డిమాండ్ చేసింది. అమ్మాయిపై అత్యాచారం చేసిన 139 మంది నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ట్యాంకు బండ్​పై ఉన్న అంబేడ్కర్​ విగ్రహం ముందు ధర్నా నిర్వహించారు.

పంజాగుట్ట పోలీస్ స్టేషన్​లో పిర్యాదు చేయడానికి వెళ్లిన అమ్మాయిని కులం పేరుతో దూషించిన సీఐ నిరంజన్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేసి ఆయనపై చర్యలు తీసుకోవాలని సంఘం నాయకులు డిమాండ్ చేశారు.

అమ్మాయికి ప్రాణరక్షణ కల్పించాలని... దోషులు ఎంతటి వారైనా వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని వారు హెచ్చరించారు.

ఇవీ చూడండి: 139సార్లు అత్యాచారం.. సీఐడీ దర్యాప్తు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.