ఎంపీటీసీ ఎన్నికల్లో గెలిచి ఎంపీపీ కావాలన్న ఆ మహిళ ఆకాంక్షను కరోనా బలి తీసుకుంది. అయితే ఎంపీటీసీ ఎన్నికల్లో మాత్రం ఆమె విజయం సాధించారు. ఏపీలోని గుంటూరు జిల్లా కర్లపాలెం-1 ఎంపీటీసీ స్థానానికి వైకాపా తరపున దొంతిబోయిన ఝాన్సీ లక్ష్మి పోటీ చేశారు. కర్లపాలెం ఎంపీపీ పదవి కూడా ఆమెకే దక్కుతుందని అంతా భావించారు.
ఏప్రిల్ 8న ఎన్నికలు జరిగాయి. ఇదిలా ఉంటే.. జూన్ నెలలో కరోనాతో ఆమె మరణించారు. ఇవాళ జరిగిన ఓట్ల లెక్కింపులో ఝాన్సీ లక్ష్మి 134 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు ఆమెను గుర్తుచేసుకుని విషాదంలో మునిగారు.
ఇదీ చూడండి: MPTC ZPTC results 2021: గెలిచినప్పటికీ అస్వస్థతలో ఎంపీటీసీ.. ఉత్కంఠ తట్టుకోలేకే..!