ETV Bharat / state

'తెరాస రహదారులు దిగ్బంధం చేస్తే తప్పు కాదు .. తామూ ధర్నాలు చేయడం తప్పా'

MP UTTAM KUMAR REDDY: కాంగ్రెస్ నేతలను అరెస్టు చేయడం, గృహనిర్బంధంలో ఉంచడం అప్రజాస్వామికమని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ధరల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నాయని ధ్వజమెత్తారు.

MP UTTAM KUMAR REDDY
ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి
author img

By

Published : Apr 7, 2022, 12:08 PM IST

MP UTTAM KUMAR REDDY: కాంగ్రెస్ నేతలను అరెస్టు చేయడం, గృహనిర్బంధంలో ఉంచడం అప్రజాస్వామికమని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. రోజురోజుకు పెట్రోల్, డీజిల్, గ్యాస్‌ధరలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విద్యుత్‌ ఛార్జీల పెంపు సామాన్యుల పాలిట శాపంగా మారిందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొండి వైఖరిని ప్రదర్శిస్తూ ధాన్యం కొనుగోళ్లలో గందరగోళాన్ని సృష్టిస్తుండడంతో రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని మండిపడ్డారు. అధికార తెరాస రహదారులు దిగ్బంధం చేస్తే తప్పు కాదు కానీ తామూ ధర్నాలు చేయడం తప్పా అని ఉత్తమ్ ప్రశ్నించారు.

ప్రభుత్వాల అసమర్థతను కప్పి పుచుకోవడానికే భాజపా , తెెరాసలు ఒకరిపై ఒకరు ఉద్యమాలు చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నాయని ఉత్తమ్‌ ఆరోపించారు. ధరలపెంపుపై నిరసనలకు సిద్ధమైన పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి సహా ముఖ్యనేతల గృహనిర్బంధాన్ని ఖండించారు. వెంటనే వారిని విడుదల చేయాలని ఉత్తమ్ డిమాండ్‌ చేశారు.

కాంగ్రెస్ నేతల అరెస్టులు: పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్‌ నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా టీపీసీసీ ఆధ్వర్యంలో విద్యుత్‌ సౌధ, సివిల్‌ సప్లై కార్యాలయాల ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు నాయకులను హౌస్‌ అరెస్టులు చేస్తున్నారు. నెక్లెస్‌ రోడ్‌లోని ఇందిరమ్మ విగ్రహం నుంచి ఖైరతాబాద్‌ వరకు ప్రదర్శన చేపట్టనట్లు తెలియడంతో.... పోలీసులు నాయకుల ఇళ్ల చుట్టూ భారీగా మోహరించారు.

ఇదీ చదవండి: కాంగ్రెస్‌ నేతల గృహనిర్బంధం.. నిరసనకు వెళ్లకుండా అడ్డగింత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.