రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ జన్మదినాన్ని తెరాస శ్రేణులు హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో క్రీడాకారులు, తెరాస నాయకులు పాల్గొన్నారు.
బషీర్‌బాగ్‌లోని కనక దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేక్ కట్ చేసి సంతోష్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అనంతరం... అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సంతోష్ కుమార్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండి.. మరెన్నో ఉన్నతమైన పదవులు అధిరోహించాలని పూజలు చేసినట్లు ఛైర్మన్ తెలిపారు.
పచ్చదనం కోసం గ్రీన్ ఛాలెంజ్ చేపట్టిన సంతోష్ కుమార్.. క్రీడల అభివృద్ధి కోసం కూడా ఓ కార్యక్రమం చేపట్టాలని హ్యాండ్ బాల్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కోరారు.