హైదరాబాద్ కొత్తపేట వ్యవసాయ పండ్ల మార్కెట్‌ను కొహెడకు తరలించవొద్దని వ్యాపారుల చేస్తున్న ఆందోళనకు మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి మద్దతు తెలిపారు. కొహెడలో నాణ్యమైన షెడ్లు నిర్మించిన తరువాత అక్కడికి తరలించాలని ఆయన డిమాండ్ చేశారు. మే నెలలో గాలి వానకు కొహెడలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన షెడ్లు కూలిపోయి సుమారు 50 మందికి తీవ్ర గాయాలు అయ్యాయని ఎంపీ పేర్కొన్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం నాణ్యమైన షెడ్లు నిర్మించిన తరువాత కొహెడకు తరలించాలని కోరారు. పండ్లు అన్ని ఒకే చోట దొరికే విధంగా ఏర్పాట్లు చేయాలని.. లేని పక్షంలో రైతులు, ట్రేడర్స్ తరఫున ఆగస్టు 2 నుంచి 3 వరకు దీక్ష చేపడుతానని ఎంపీ రేవంత్ రెడ్డి వెల్లడించారు.
ఇవీ చూడండి: తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా... కుటుంబ సభ్యులందరికీ పాజిటివ్