ETV Bharat / state

ముఖ్యమంత్రి కేసీఆర్​కు రేవంత్ రెడ్డి లేఖ...

author img

By

Published : Sep 22, 2019, 9:29 PM IST

పోలీస్ కానిస్టేబుల్ నియామక పరీక్షల మెరిట్ జాబితాను, కటాఫ్​ మార్కలను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్​కు ఎంపీ రేవంత్ రెడ్డి లేఖ రాశారు.

రాష్ట్ర ప్రభుత్వానికి ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

పోలీసు కానిస్టేబుల్‌ నియామక పరీక్షలకు చెందిన మెరిట్‌ జాబితాను, కటాఫ్‌ మార్కులను తక్షణమే ప్రకటించాలని మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌ రెడ్డి... సీఎం కేసీఆర్​కు లేఖ రాశారు. 90 వేల మంది నిరుద్యోగ యువతకు సంబంధించిన ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరారు. ఫలితాల విడుదలపై స్పష్టత లేక ఐదు నెలలుగా అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారని రేవంత్ రెడ్డి వెల్లడించారు. నగరంలో ప్రైవేటు వసతి గృహాల్లో ఉంటూ ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లినా స్పందన రాలేదని పేర్కొన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని కటాఫ్ మార్కులు, మెరిట్ లిస్టు విడుదలకు డీజీపీ, బోర్డు ఛైర్మన్ లను ఆదేశించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

ఇవీ చూడండి: దేశంలో మళ్లీ ఉల్లి కష్టాలు... కిలో రూ.80..!

TG_Hyd_64_22_MP_REVANTH_LETTER_TO_CM_AV_3038066 Reporter: Tirupal Reddy గమనిక: రేవంత్‌ లేఖ డెస్క్‌ వాట్సప్‌కు పంపించాను. వాడుకోగలరు. ()పోలీసు కానిస్టేబుల్‌ నియామక పరీక్షలకు చెంది మెరిట్‌ జాబితాను, కటాఫ్‌ మార్కులను తక్షణమే ప్రకటించాలని మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎంపీ రేవంత్ రెడ్డి ఇవాళ ఆ మేరకు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పోలీసు కానిస్టేబుళ్ల నియామక పపరీక్షలో ఉత్తీర్ణులైన 90వేల మంది అభ్యర్ధులు మెరిట్‌ జాబితా, కటాఫ్‌ మార్కుల కోసం వేచి చూస్తున్నారన్నారు. పోలీసు శాఖలో 16,926 పోస్టుల భర్తీకి గత ఏడాది మే నెలలో నోటిఫికేషన్‌ విడుదల చేసినా...ఇప్పటి వరకు ప్రక్రియ పూర్తి చేయలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరీక్షకు హాజరైన నిరుద్యోగ యువత ప్రస్తుతం సొంత ఊళ్లకు వెళ్లలేక హైదరాబాద్‌లోనే ప్రయివేటు వసతిగృహాల్లో ఉంటూ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. ఫలితాల విషయంలో పోలీసు నియామక బోర్డును సంప్రదించినా, సహాయ కేంద్రం ద్వారా తెలుసుకునేందుకు యత్నించినా సరియైన స్పందన రాలేదని బాధిత నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఈ విషయం తన దృష్టికి రాగానే ట్విట్టర్‌ ద్వారా మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లినా...రాష్ట్ర డీజీపీ, బోర్డు ఛైర్మన్‌ను సంప్రదించి స్పష్టత ఇస్తానని హామీ ఇచ్చి నెల గడిచినా సమాధానం లేదని వివరించారు. సమస్య తీవ్రతను అర్థం చేసుకుని తక్షణమే ఫలితాలు విడుదల చేసేవిధంగా సంబంధిత పోలీసు నియామక బోర్డు ఛైర్మన్‌ను, రాష్ట్ర డీజీపీని ఆదేశించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. 90 వేల మంది నిరుద్యోగ యువతకు సంబంధించిన ఈ సమస్యను తక్షణం పరిష్కరించాలి- రేవంత్ రెడ్డి. ఫలితాల విడుదల పై స్పష్టత లేక ఐదు నెలలుగా అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారు- రేవంత్ రెడ్డి. నగరంలో ప్రైవేటు హాస్టళ్లలో ఉంటూ ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు- రేవంత్ రెడ్డి. మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లినా స్పందన రాలేదు- రేవంత్ రెడ్డి. తక్షణం జోక్యం చేసుకుని కటాఫ్ మార్కులు, మెరిట్ లిస్టు విడుదలకు డీజీపీ, బోర్డు ఛైర్మన్ లను ఆదేశించండి- రేవంత్ రెడ్డి.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.