వలస కార్మికుల ఇబ్బందులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాలని పీసీసీ కార్యవర్గ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ వలస కూలీల సమస్యలు వినాలని కోరారు. ఉపాధిహామీ పనులను 200 రోజులకు పెంచాలని, రక్షణ శాఖకు నిధులను తగ్గించాలని సూచించారు. కాంగ్రెస్ దేశవ్యాప్తంగా చేపట్టిన ఆన్లైన్ పోరాటంలో భాగంగా రేవంత్ రెడ్డి వలస కార్మికుల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని ఆరోపించారు.
కరోనా కష్టాల్లో వలస కూలీలు వేల కిలోమీటర్లు నడుస్తూ తీవ్ర నరకయాతన అనుభవిస్తున్నా పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఆరు నెలల పాటు ప్రతి కుటుంబానికి రూ. 7500 ఇవ్వాలని కోరారు. చిన్న తరహా పరిశ్రమలు చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటున్న వారికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక చేయూతను అందించాలని అన్నారు.
ఇదీ చూడండి : పోలీసులపై కత్తితో దాడికి యత్నం..