ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లే ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారని ఎంపీ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. రాజ్యాంగంలో లేని పద్ధతిని తీసుకొచ్చి సీఎం ఆర్టీసీ ఉద్యోగులను బాధపెడుతున్నారని తెలిపారు. శ్రీనివాస్ రెడ్డి మరణ వాంగ్మూలాన్ని సాక్షిగా తీసుకుని మంత్రి పువ్వాడ అజయ్, సీఎం కేసీఆర్‌పై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. శ్రీనివాస్‌రెడ్డి కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలన్నారు. ఆర్టీసీ కార్మికులు తీసుకోబోయే భవిష్యత్తు కార్యాచరణకు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
ఇదీ చదవండిః అలర్ట్: ఆర్టీసీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల