తనపై కొద్దిరోజులుగా కొందరు బెదిరింపులకు దిగుతున్నారని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. వీటిపై ఎస్పీకి ఫిర్యాదు చేసినా.. పట్టించుకోలేదని అన్నారు. షోకాజ్ నోటీసుపై న్యాయనిపుణులను సంప్రదిస్తున్నానని తెలిపారు. పార్టీపై పల్లెత్తు మాట అనలేదని.. అయినా వైకాపా సామాజిక మాధ్యమాల్లో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
'క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్తను. పార్టీని, పార్టీ అధ్యక్షుడిని నేనెప్పుడూ వ్యతిరేకించలేదు. ఇలాంటి ప్రయత్నాలు మానాలని విజయసాయిరెడ్డిని కోరుతున్నా. సీఎంను కలిసే అవకాశం కోసం ఎదురుచూస్తున్నా. ముఖ్యమంత్రి నాకు సోమవారం అపాయింట్‌మెంట్ ఇస్తే సంతోషం. నా ఫ్లెక్సీలను ఏం చేశారో అందరూ చేశారు. రక్షణ కల్పించాకే నియోజకవర్గానికి వెళ్తా. ఇప్పుడు వెళ్తే కరోనా నిబంధనల ఉల్లంఘన కేసులు పెడతారు'- రఘురామకృష్ణరాజు