MP Laxman comments on Narendra Modi Warangal tour : ప్రధానమంత్రి రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడల్లా సీఎం కేసీఆర్ మొహం చాటేస్తున్నారని బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్ విమర్శించారు. బెంగాల్, తమిళనాడు, ఏపీలో ప్రధాని వస్తే ప్రొటోకాల్ పాటిస్తారని.. తెలంగాణలో మాత్రం అలా ఉండదని ఆయన ఆరోపించారు. చివరికు కేరళ లాంటి కమ్యూనిస్టు ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రంలోనూ ప్రొటోకాల్ పాటిస్తూ అభివృద్ధిలో పాలు పంచుకుంటే.. కేసీఆర్ అభివృద్ధికి దూరంగా ఉంటున్నారని దుయ్యబట్టారు.
హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. కేసీఆర్‌పై తనదైన శైలిలో విమర్శలు చేశారు. సమతామూర్తి విగ్రహం, ఇక్రిశాట్, సికింద్రాబాద్ రైల్వే అభివృద్ధి పనులు, ఐఎస్బీ స్నాతకోత్సవం, రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ పునఃప్రారంభం, నీతి అయోగ్ సమావేశానికి కూడా సీఎం కేసీఆర్ హాజరు కాలేదని లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాలు ఎన్ని ఉన్నా.. ప్రజల అభివృద్ధిని అడ్డుకోవడం సరికాదని హితవు పలికారు. శనివారం ప్రధాని మోదీ వరంగల్ పర్యటనలో కేసీఆర్ పాల్గొనాలని ఆయన కోరారు.
- Modi Tour in Telangana : జులై 8న వరంగల్‌కు ప్రధాని.. రూ.6,050 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన
- Kishan Reddy Comments on BRS : 'తెలంగాణలో బీఆర్ఎస్ను భర్తీ చేసేది బీజేపీ మాత్రమే'
Narendra Modi Warangal Tour : ఈ సందర్భంగా ప్రధాని మోదీ వరంగల్ పర్యటన వివరాలను వివరించారు. పర్యటనలో భాగంగా రూ.6 వేల 100 కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు. కాజీగూడ రైల్వే వాగన్ ప్రాజెక్టు, జాతీయ రహదారుల విస్తరణ పనులకు శ్రీకారం చుడతారని పేర్కొన్నారు. అలాగే కార్యక్రమం అనంతరం భారీ బహిరంగ సభలో పాల్గొంటారని తెలిపారు. ఆ సభకు బీజేపీ కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున తరలిరావాలని విజ్ఞప్తి చేశారు.
MP Laxman on Rahul Gandhi defamation case : మరోవైపు.. ఓబీసీ సమాజాన్ని దూషిస్తే చట్టం ఎవరికీ అతీతం కాదని గుజరాత్ హైకోర్టు తీర్పు వల్ల స్పష్టం అయ్యిందని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఆ తీర్పు రాహుల్ గాంధీకి చెంపపెట్టు లాంటి తీర్పు అన్నారు. ఒక సామాజిక వర్గాన్ని దూషించడం నేరమని లక్ష్మణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
"ప్రధాన మంత్రి రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడల్లా సీఎం కేసీఆర్ మొహం చాటేస్తున్నారు. బెంగాల్, తమిళనాడు, ఏపీ, చివరికు కేరళ రాష్ట్రంలో కూడా ప్రొటోకాల్ పాటిస్తారు. తెలంగాణలో మాత్రం ప్రొటోకాల్ పాటించరు. కేసీఆర్ అభివృద్ధికి దూరంగా ఉంటున్నారు. రాజకీయాలు ఎన్ని ఉన్నా ప్రజల అభివృద్ధిని అడ్డుకోవడం సరికాదు. ఓబీసీ సమాజాన్ని దూషిస్తే చట్టం ఎవరికీ అతీతం కాదని గుజరాత్ హైకోర్టు తీర్పు వలన స్పష్టమైంది. ఆ తీర్పు రాహుల్ గాంధీకి చెంపపెట్టు లాంటి తీర్పు" - లక్ష్మణ్, రాజ్యసభ సభ్యుడు
ఇవీ చదవండి: