Komatireddy on Singareni Tenders: సింగరేణికి చెందిన ఒడిశాలోని మైన్స్‌కి సంబంధించి పిలిచిన టెండర్లలో అవకతవకలు జరిగాయని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. సింగరేణి కంపెనీకి దేశంలోని కోల్ ఇండియా సంస్థ... ఒడిశాలో నైని కోల్‌మైన్‌ను కేటాయించిందన్నారు. ఇందుకు సంబంధించిన మైన్‌కు ఈనెల 8న టెండర్ల ప్రక్రియ జరిగిందన్నారు. దీనిపై గత నెల 10న టెండర్ల ప్రక్రియకు సంబంధించి ప్రధాని మోదీకి తాను, రేవంత్‌రెడ్డి ముందే ఫిర్యాదు చేసినట్లు కోమటి రెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. టెండర్లలో కోల్ ఇండియా నిబంధనలు సింగరేణిలో పాటించట్లేదని వెంకట్‌రెడ్డి వాపోయారు. సీఎం సమీప బంధువు సంస్థ సింగరేణి టెండర్లలో పాల్గొన్నదని కోమటిరెడ్డి ఆరోపించారు. రూ.20వేల కోట్లు చేతులు మారే టెండర్లలో పారదర్శకత లేదన్నారు. నిజాయతీ ఉంటే కోల్ ఇండియా వలే సింగరేణిలో టెండర్లు పిలవాలని కోమటిరెడ్డి సూచించారు.
కోయగూడెం బ్లాక్-3 బిడ్డింగ్‌కు సాంకేతిక ఆమోదం!
కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ గత నెల 31న నిర్వహించిన వేలం ప్రక్రియలో సింగరేణికి చెందిన కోయగూడెం బ్లాక్-3 గనిపై ఒకే ఒక బిడ్డర్ ఆసక్తి చూపినప్పటికీ దానికి ఆమోదం తెలుపుతూ సాంకేతిక కమిటీ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా మొత్తం 88 బొగ్గు బ్లాకులకు వేలం నిర్వహించింది. వాటిలో సింగరేణికి చెందిన నాలుగు బొగ్గు బ్లాకులు- ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి బ్లాక్-3, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కోయగూడెం బ్లాక్-3, మంచిర్యాల జిల్లాలోని శ్రావణ్‌పల్లి బ్లాక్-3, కళ్యాణిఖని-6 ఉన్నాయి. కోయగూడెం బ్లాక్-3కి ఆరో కోల్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ బిడ్డింగ్‌లో పాల్గొంది. ఈ నెల 4న నిర్వహించిన టెక్నికల్ ఎవల్యూషన్ కమిటీ సమావేశంలో సింగిల్ బిడ్డింగ్ వచ్చిన గనులపై చర్చించారు. బిడ్డింగ్‌లో పాల్గొన్న సింగిల్ కంపెనీలకు సాంకేతికంగా ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో సింగరేణికి చెందిన కోయగూడెం బ్లాక్-3 చేజారే పరిస్థితి ఏర్పడింది.
ఇదీ చూడండి: Bankhui mine : సింగరేణి చేజారిన ‘బాంఖుయ్’... వేలంలో దక్కించుకున్న ప్రైవేటు కంపెనీ..