కాళేశ్వరం ప్రాజెక్టు పనులు 90 శాతం మేర పూర్తయ్యాయని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పేర్కొన్నారు. పాలమూరు-రంగారెడ్డి, డిండి పనులు 9 శాతం కూడా పూర్తికాలేదని వెల్లడించారు. కమీషన్ల కోసం నాలుగు జిల్లాలను ఎండబెడుతున్నారని ఆరోపించారు. నల్గొండ జిల్లాలో నీళ్లు రావాలంటే వెయ్యి ఫీట్లు వేయాలని చెప్పారు. జిల్లాకు ప్రాజెక్టు వచ్చి ఉంటే చెరువులు నిండి భూగర్భ జలాలు పెరిగేవని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: 'ప్రభుత్వ చర్యతో తెలంగాణ జిల్లాలు ఎడారిగా మారబోతున్నాయి'