జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో వీరమరణం పొందిన మహేశ్ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా కోమన్‌పల్లికి చెందిన వీరజవాన్ కుటుంబానికి రూ.కోటి, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఆయన కోరారు.
దేశం రక్షణలో మహేశ్ చూపిన ధైర్యాన్ని ఎంపీ కొనియాడారు. రాబోయే తరానికి గుర్తుండేలా స్వగ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు అతని పేరు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వీరసైనికుని కుటుంబానికి తగిన న్యాయం చేయాలన్నారు.