'నమామి గంగే' తరహాలో మూసీ నది ప్రక్షాళన చేపట్టాలని ప్రధాని మోదీని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. ఈరోజు ప్రధానితో ఆయన భేటీ అయ్యారు. నాలుగు ప్రధాన అంశాలపై ప్రధానికి వినతిపత్రాలు అందించారు. మూసీ ప్రక్షాళనకు రూ.3 వేల కోట్లు కేటాయించాలని ప్రధానిని ఆయన కోరారు.
హైదరాబాద్ శివారులో ఏర్పాటు చేయబోతున్న ఫార్మాసిటీని తరలించాలని కోమటిరెడ్డి విజ్ఞప్తి చేశారు. రూ.1,045 కోట్లతో బ్లాక్ స్థాయి చేనేత క్లస్టర్లు ఏర్పాటు చేయాలన్నారు. గౌరెల్లి- కొత్తగూడెం జాతీయ రహదారికి నంబరుతో పాటు అభివృద్ధికి నిధులు కేటాయించాలని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: దిశ తరహా మరో ఘటన.. రంగారెడ్డి జిల్లాలో మహిళ హత్యాచారం