కేసీఆర్ నిర్ణయాలను చూస్తుంటే తుగ్లక్‌కే పిచ్చి పట్టేట్టుగా ఉందని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఎద్దేవా చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలోనే ఉద్యోగుల పైన ప్రేమ పుట్టుకువచ్చిందా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే ఎన్నికలలోపే ఉద్యోగులకు వేతనాలు పెంపు, వయో పరిమితి పెంపు, ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
ఎల్‌ఆర్‌ఎస్‌ను శాశ్వతంగా రద్దు చేయాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. లేకపోతే సీఎం కేసీఆర్, తెరాస పార్టీని ప్రజలు శాశ్వతంగా రద్దు చేస్తారని హెచ్చరించారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే చూస్తూ ఊరుకోబోమని అన్నారు. రానున్న రోజుల్లో ఉద్యమాలు, పోరాటాలతో కేసీఆర్ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: మాజీ మంత్రి కుటుంబాన్ని పరామర్శించిన దత్తాత్రేయ