ఎల్ఆర్ఎస్కు వ్యతిరేకంగా కలెక్టరేట్ల వద్ద చేపట్టిన నిరసన... విజయవంతమైందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. కార్యకర్తలను అరెస్టు చేయడం దారుణమన్నారు. ప్రభుత్వ ఆంక్షల్ని ఎదుర్కొని నిరసన తెలిపిన భాజపా శ్రేణులను ఆయన అభినందించారు.
రెండు పడక గదుల ఇళ్ల పేరుతో ప్రభుత్వం పేదలను మోసం చేసిందని సంజయ్ ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో తెరాసకు గట్టి సమాధానం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. కరోనా సంక్షోభ సమయంలో ఎల్ఆర్ఎస్ భారం మోపడం సరి కాదని సంజయ్ అభిప్రాయపడ్డారు.
ఇదీ చూడండి: కేటీఆర్ అబద్ధాలు చెప్పుడు మానాలి : ఎంపీ అర్వింద్