ETV Bharat / state

ఆ భయమే.. కన్నపేగు కాటేసేలా చేసిందా - Mother commits suicide along with her twins

Mother commits suicide with her twins: గతంలోలాగ ఇప్పుడు పుట్టిన పిల్లలు కూడా కొద్దిరోజులకే చనిపోతారనే భయంతో ఒ వివాహిత తన కవల పిల్లలను నీటిసంపులో వేసి తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన అల్వాల్​ పోలీసుస్టేషన్​ పరిధిలో చోటుచేసుకుంది.

Mother commits suicide with her twins
Mother commits suicide with her twins
author img

By

Published : Feb 20, 2023, 1:32 PM IST

Updated : Feb 20, 2023, 2:45 PM IST

Mother commits suicide with her twins: మాతృమూర్తికి తమ పిల్లలను మించిన ఆనందం ఏదీ ఉండదు. వారే తమ సర్వస్వంగా భావించి బతుకుతారు. కలలో కూడా వారు దూరం కావాలనుకోరు. పండంటి కవల పిల్లలకు జన్మనిచ్చిన అమె గతంలోలాగా ఇప్పుడు కూడా తన పిల్లలను కొల్పోతానేమోనని భయపడింది వారిని నీటి సంపులో వేసి చంపి తాను ఆత్మహత్య చేసుకుంది.

"మేనరికవివాహం" అనుమానమే భయంగా మారిందా..

అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న సంధ్యారాణి అనే వివాహిత ఇటీవలే కవల పిల్లలకు జన్మనిచ్చింది. గతంలోను కవల పిల్లలు పుట్టారు. పుట్టిన కొన్నిరోజులకే కవల పిల్లలు మృతి చెందడంతో భార్యభర్తలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇటీవల మరోసారి ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన సంధ్యారాణి మేనరికం మూలంగా పిల్లలు చనిపోతారని మనోవేదనకు గురై పిల్లలను సంపులో పడేసి చంపి ఆమె కూడా ఆత్మహత్యకు పాల్పడింది. కవలపిల్లలు పుట్టి కేవలం 15 రోజులు మాత్రమే గడుస్తోంది. ఘటనస్థలికి చేరుకున్న ఆల్వాల్ పోలీసులు మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇవీ చదవండి:

Last Updated : Feb 20, 2023, 2:45 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.